Snow: చెన్నై నగరాన్ని కప్పేసిన మంచు దుప్పటి
ABN , Publish Date - Feb 05 , 2025 | 10:57 AM
నగరంలో, నగర శివారు ప్రాంతాల్లో మంగళవారం దట్టమైన మంచు అలముకోవడంతో విమాన, రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్, చోళింగనల్లూరు, పెరుంబాక్కం, ఈస్ట్‌కోస్ట్ రోడ్డు, మేడవాక్కం, చిట్లపాక్కం, ఒట్టియంబాక్కం తదితర ప్రాంతాల్లో వేకువజాము ఐదు గంటల నుండే దట్టమైన మంచు దుప్పటిలా కప్పేసింది.

- విమాన, రైలు సేవలకు అంతరాయం
చెన్నై: నగరంలో, నగర శివారు ప్రాంతాల్లో మంగళవారం దట్టమైన మంచు అలముకోవడంతో విమాన, రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్, చోళింగనల్లూరు, పెరుంబాక్కం, ఈస్ట్‌కోస్ట్ రోడ్డు, మేడవాక్కం, చిట్లపాక్కం, ఒట్టియంబాక్కం తదితర ప్రాంతాల్లో వేకువజాము ఐదు గంటల నుండే దట్టమైన మంచు దుప్పటిలా కప్పేసింది. దీంతో రోడ్లలో వెళుతున్న వాహనాలు కనిపించ వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చెంగల్పట్టు- చెన్నై బీచ్‌స్టేషన్(Chengalpattu- Chennai Beach Station) నడుమ లోకల్ విద్యుత్ రైళ్లు కూడా మంచు కారణంగా నత్తనడక నడిచాయి. పట్టాలు కనిపించకపోవడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లన్నీ పావుగంట నుంచి అరగంట మేర ఆలస్యంగా గమ్యస్థానాలు చేరుకున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: CRPF : ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ప్రెషర్ బాంబు
25 విమానసేవలకు అంతరాయం..
దట్టమైన మంచు కారణంగా మీనంబాక్కం ఎయిర్‌పోర్టులో 25కు పైగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మంచు కారణంగా ఆరు విమానాలు ల్యాండింగ్ కాలేక బెంగళూరు, తిరువనంతపురం, హైదరాబాద్(Bangalore, Thiruvananthapuram, Hyderabad)కు మళ్ళించారు. ఇక నగరం నుండి బయలుదేరాల్సిన 15కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. బుధవారం కూడా నగరంలో వేకువజామున దట్టమైన మంచుకురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు.
వార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!
ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ
Read Latest Telangana News and National News