Share News

Atishi: ఎన్నికల వేళ సీఎంకు ఉపశమనం.. పరువునష్టం కేసు కొట్టివేత

ABN , Publish Date - Jan 28 , 2025 | 05:27 PM

గత ఏడాది ఏప్రిల్‌లో అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న అతిషి బీజేపీపై ఆరోపణలు చేశారు. తనను, ఇతర ఆప్ నేతలను బీజేపీకి చెందిన కొందరు సంప్రదించినట్టు తెలిపారు. తమ పార్టీలోకి చేరాలని, లేదంటే నెలలోగా ఈడీ అరెస్టును ఎదుర్కోవలసి వస్తుందని వారు చెప్పినట్టు అతిషి ఆరోపించారు.

Atishi: ఎన్నికల వేళ సీఎంకు ఉపశమనం.. పరువునష్టం కేసు కొట్టివేత

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ 'ఆప్' సీనియర్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi)కి ఉపశమనం లభించింది. అతిషిపై బీజేపీ (BJP) నేత ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పరువునష్టం పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. అతిషి చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీని ఉద్దేశించి చేసినవే కానీ, నిర్దిష్ట వ్యక్తులను ఉద్దేశించి చేసినవి కావని కోర్టు పేర్కొంటూ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.

Delhi Elections: ఎంఐఎం అభ్యర్థికి కస్టడీ పెరోల్.. రోజుకు 2 లక్షల డిపాజిట్‌


గత ఏడాది ఏప్రిల్‌లో అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న అతిషి బీజేపీపై ఆరోపణలు చేశారు. తనను, ఇతర ఆప్ నేతలను బీజేపీకి చెందిన కొందరు సంప్రదించినట్టు తెలిపారు. తమ పార్టీలోకి చేరాలని, లేదంటే నెలలోగా ఈడీ అరెస్టును ఎదుర్కోవలసి వస్తుందని వారు చెప్పినట్టు అతిషి ఆరోపించారు. దీనిపై ప్రవీణ్ శంకర్ కపూర్ కేసు వేశారు. బీజేపీపై అతిషి, ఆప్ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని, తమ ఆరోపణలకు తగిన సాక్ష్యాలు చూపించలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేవారం జరుగనున్న తరుణంలో రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన రూలింగ్‌ అటు ఆప్‌కు, ఇటు అతిషికి ఉపశమనం కలిగించిందని చెబుతున్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి రెండోసారి పోటీ చేస్తున్నారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..

Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 28 , 2025 | 05:30 PM