విద్యార్థి నేత నుంచి సీఎం పీఠానికి రేఖా గుప్తా
ABN , Publish Date - Feb 19 , 2025 | 08:33 PM
కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శర్మను ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకున్నట్టు పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. శాసనసభా పక్షనేతగా రేఖాశర్మ ఎంపిక కావడంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆమె పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభా పక్ష నేతగా రేఖా గుప్తా (Rekha Sharma)ను ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శర్మను ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకున్నట్టు పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. శాసనసభా పక్షనేతగా రేఖాశర్మ ఎంపిక కావడంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆమె పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేకపోవడంతో ఆ క్రెడిట్ రేఖా శర్మకు దక్కింది. గతంలో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు ఢిల్లీ సీఎంగా షీలాదీక్షిత్ పనిచేశారు. ఇటీవల కొద్ది నెలల పాటు 'ఆప్' ముఖ్యమంత్రిగా అతిషి పనిచేశారు.
Delhi CM: ఢిల్లీ సీఎంను ప్రకటించిన బీజేపీ.. అందరి అంచనాలు తారుమారు..
ఎవరీ రేఖా గుప్తా
విద్యార్థి నాయకురాలిగా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం సాగించిన 50 ఏళ్ల రేఖా గుప్తా ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దీనికి ముందు బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవల జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ (నార్త్-వెస్ట్ ) నియోజవర్గం నుంచి 68,200 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వృత్తిరీత్యా లాయర్ అయిన 1996 నుంచి 1997 వరకూ ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశఆరు. ఆ తర్వాత మున్సిపల్ రాజకీయాల్లోకి అడుగపెట్టి ఉత్తరి పితాంపుర (వార్డు 54) నుంచి 2007లో గెలిచారు. తిరిగి 2012లో ఎన్నికయ్యారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా పనిచేశారు.
ప్రమాణస్వీకారం
గురవారం ఉదయం 11 గంటల నుంచి 12.34 గంటల వరకూ కార్యక్రమం జరుగుతుందని, 12.05 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. ప్రఖ్యాత్ రామ్‌లీలా మైదాన్‌లో జరుగనున్న ఈ వేడకుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరువుతారు. 50 మందికి సీనీతారలు, పారిశ్రామిక వేత్తలతో పాటు దౌత్యవేత్తలు, బీజేపీ మిత్రపక్షాలకు చెందిన 200 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి అతిషికి కూడా ఆహ్వానాలు పంపినట్టు చెబుతున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి మూడు వేదికలు ఏర్పాటు చేస్తు్న్నారు. ఒక వేదికపై మోదీ, అమిత్‌షా, ఎల్జీ వీకే, సక్సేనా, కొత్త ముఖ్యమంత్రి ఉంటారు. రెండో వేదికపై మత పెద్దలు, మూడో వేదికపై బీజేపీ, మిత్రపక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం సీటింగ్ ఏర్పాట్లు చేశారు.
సీఎంతో పాటు ఆరుగురు
ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు పర్వేష్ వర్మ చేపడతారని తెలుస్తోంది. ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాలకు 48 సీట్లు గెలుచుకుని విజయబావుటా ఎగురవేసింది. రెండు సార్లు అధికారంలో ఉన్న ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితమైంది.
ఇవి కూడా చదవండి..
Delhi CM Oath: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్, అతిషి హాజరవుతారా?
PM Kisan: రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24లోపు ఈ పని చేయండి.. లేదంటే..
Ayodhya Ram Temple: ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.