Delhi Assembly Elections: ఢిల్లీలో మేము ఓడిపోతాం.. గెలుపు ఆపార్టీదే.. తేల్చేసిన కాంగ్రెస్ అగ్రనేత
ABN , Publish Date - Feb 06 , 2025 | 06:46 PM
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఈ ఎన్నికల్లో ఆప్ తన అధికార పీఠాన్ని మళ్లీ దక్కించుకొంటుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 06: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే.. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీదే గెలుపు అంటూ అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ గురువారం న్యూఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ అధికారాన్ని చేపడుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో సర్వేలు బీజేపీ విజయం సాధిస్తుందని చెబుతున్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం ఆప్ చాలా బలంగా ఉందన్నారు.
అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆప్‌ను తక్కువ అంచనా వేశాయన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విశ్వసించలేమని చెప్పారు. ఢిల్లీ ప్రజలు సైతం ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీల పట్ల ఆసక్తి కనబరిచారని పేర్కొ్న్నారు. శనివారం ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని చెప్పారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. ప్రభావం చూపిందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 17 నుంచి శాతం ఓట్లు సాధించ వచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ బాగా పోరాడిందన్నారు.
అయితే ఓటర్లు ఏ మేరకు మద్దతు తెలిపారో.. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించాలన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. ఆప్, బీజేపీపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు.. ఓటర్లకు నగదు పంచి.. ఎన్నికల విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీశాయన్నారు. తాను ఈ ఎగ్జిట్ పోల్స్‌ను విశ్వసించనన్నారు. ప్రజా తీర్పు.. బీజేపీ, ఆప్‌కు వ్యతిరేకంగా రానుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోందని ఎంపీ ప్రమోదు తివారీ వెల్లడించారు.
Also Read: క్రీడాకారులకు తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీనే విజయం సాధిస్తుందంటూ దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. కానీ కేకే సర్వే మాత్రం ఆప్ ఘన విజయం సాధిస్తుందని ప్రకటించింది. అంతేకాదు.. ఢిల్లీ అసెంబ్లీ నియోజకర్గంలోని మొత్తం 9 జిల్లాల్లో ఆప్‌కి, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో సోదాహరణగా ఈ సర్వే వివరించింది. ఇక న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సందీప్ దీక్షిత్, బీజేపీ అభ్యర్థిగా పర్వేష్ వర్మ బరిలో నిలిచారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?
Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి
Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు
Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత
For National News And Telugu News