Delhi Polls: మెగా ర్యాలీలతో హొరెత్తనున్న బీజేపీ ప్రచారం.. రంగంలోకి మోదీ
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:00 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి చివరి వారంలో మూడు నుంచి నాలుగు ర్యాలీల్లో పాల్గొంటారు. పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు జనవరి 23 నుంచి వరుస ర్యాలీల్లో యోగి ఆదిత్యనాథ్ దిగుతున్నారు.

న్యూఢిల్లీ: గెలుపే లక్ష్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) పావులు కదుపుతున్న భారతీయ జనాతా పార్టీ (BJP) భారీ ర్యాలీలకు సిద్ధమవుతోంది. ప్రచారానికి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో హేమాహేమీలు ప్రచారరంగంలోకి దిగుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టార్, నితిన్ గడ్కరి తదితత ప్రముఖులు సుడిగాలి ప్రచారం సాగించనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఢిల్లీలో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లనున్నారు. యోగి అదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామి, హిమంత బిస్వా శర్మ తదితరులు ప్రచారంలోకి దిగుతున్నారు.
Arvind Kejriwal: డేంజరస్ మేనిఫెస్టో.. డేంజరస్ పార్టీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి చివరి వారంలో మూడు నుంచి నాలుగు ర్యాలీల్లో పాల్గొంటారు. పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు జనవరి 23 నుంచి వరుస ర్యాలీల్లో యోగి ఆదిత్యనాథ్ దిగుతున్నారు. కిరారి, ఔటర్ ఢిల్లీ, కేశవ్ పూరమ్, వాయవ్య ఢిల్లీ, షహదర, కరోల్ బాగ్, నజఫ్‌గఢ్, మెహ్రౌలి, సౌత్ ఢిలలీ, మయూర్ విహార్ సహా పలు ప్రాంతాల్లో 14 ర్యాలీల్లో ఆయన పాల్గొంటారు. పూర్వాంచల్ ప్రముఖ నేతలైన రవి కిషన్, మనోజ్ తివారి, సమ్రాట్ చౌదరి, గిరిరాజ్ సింగ్ సైతం 23న పలు ర్యాలీల్లో పాల్గొంటారు. పూర్వాంచల్ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు కూడా నిర్వహించనుంది.
బీజేపీ ఇప్పటికే 2,500 చిన్న చిన్న సమావేశాలు, డ్రాయింగ్ రూమ్ సమావేశాలు నిర్వహించింది. మకర సంక్రాతి రోజున 50 బైఠక్‌లు (మీటింగ్స్) నిర్వహించింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కలిగే ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి ఆ పార్టీ తీసుకువెళ్తోంది. పూర్వాంచల్ ఓట్లర్లు దాదాపు 50 శాతం మంది ఢిల్లీలో ఉన్నట్టు అంచనా వేస్తున్న కమలనాథులు ప్రధానంగా ఆ ఓట్లపై దృష్టిసారిస్తున్నారు. పూర్వాంచల్ నుంచి వచ్చి మురికివాడల్లో ఉంటున్న ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. కాగా, ప్రధానమంత్రి మోదీ మంగళవారంనాడు 'మేరా బూత్ సబ్సే మజబూత్' ప్రోగ్రాంతో ఆన్‌లైన్‌లో బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఇది కూడా చదవండి..
Gautam Adani: 50 లక్షల మందికి ప్రసాదం పంపిణీ చేయనున్న గౌతమ్ అదానీ
Hero Vijay: ఆ ఎయిర్‌పోర్టుపై ప్రభుత్వానిది కపటనాటకం..
Read More National News and Latest Telugu News