Governor: గవర్నర్ సంచలన కామెంట్స్.. దళితుడే సీఎం కావాలి
ABN , Publish Date - Jan 28 , 2025 | 01:23 PM
దళిత వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ఆకాంక్షించారు. సోమవారం చిదంబరంలో జరిగిన స్వామి సహజానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ... ఇది శివుడు జన్మించిన నేలని, ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు.

- చిదంబరంలో గవర్నర్ రవి
చెన్నై: దళిత వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ఆకాంక్షించారు. సోమవారం చిదంబరంలో జరిగిన స్వామి సహజానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ... ఇది శివుడు జన్మించిన నేలని, ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు. స్వామి సహజానంద వెయ్యేళ్లకు పైగా మన దేవుడి మార్గదర్శకాలను పాటించిన వ్యక్తి అని, ఆయన దర్శన సమయంలో మనకు రెండు భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తున్నాయన్నారు. కాల్డ్‌వెల్ అమెరికా పత్రికలో భారతీయ సంస్కృతిని పూర్తిగా నాశనం చేస్తేనే మనం పరిపాలించగలమని రాశాడని,. ఈ విషయాన్నే కాల్డ్‌వెల్ బ్రిటీష్ ప్రభుత్వానికి కూడా తెలియజేశాడని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: National Games 2025: తొలిసారి ఈ రాష్ట్రంలో 38వ జాతీయ క్రీడలు.. కాసేపట్లో ప్రధాని మోదీ
అందువల్లే ఇక్కడ మతమార్పిడి జరిగిందని, క్రైస్తవ మిషనరీలు ఇక్కడి వారిని మతం మార్చేందుకు యత్నించాయని వ్యాఖ్యానించారు. బ్రిటీష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత వర్గాల ప్రజల్ని ఎలా పరిపాలించారో అర్ధం చేసుకోవాలన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం 200 ఏళ్ల క్రితమే ముగ్గురు గవర్నర్లను నియమించి మన సంస్కృతి, సంప్రదాయాలను పరిశోధించి, వారిచ్చిన నివేదిక ఆధారంగా వాటిని నాశనం చేసే పనులు ప్రారంభించిందన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం రాక ముందు మనమంతా అందమైన వృక్షంగా ఉండేవారమని, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొమ్మల్ని నాశనం చేశారని మహాత్మాగాంధీ పేర్కొన్నారని గుర్తుచేశారు.
దళిత వర్గాలు హత్యకు గురైన కీళవెన్మణి గ్రామంలో ఒక్కరికి కూడా సరైన ఇల్లు లేదని, అందుకే అక్కడ ప్రధాన మంత్రి గృహ నిర్మాణ పథకం ద్వారా ఇళ్లు నిర్మించే ప్రణాళిక చేపట్టామన్నారు. స్వామి సహజానంద విద్య ద్వారా మార్పు తీసుకురావచ్చని భావించి ఆ ప్రకారం సేవలు చేశారన్నారు. దళితవర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని, సహజానంద కల నెరవేర్చేలా ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. అన్నామలై విశ్వవిద్యాలయంలో స్వామి సహజానంద పేరుతో ఒక పీఠం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా వుండగా నందనార్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ హాస్టల్ విద్యార్థులతో గవర్నర్ ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అంతకు ముందు చిదంబరం ఓం కుళం ప్రాంతంలో ఉన్న నందనార్ మఠంలో ఉన్న సహజానంద విగ్రహానికి గవర్నర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: టకీ టకీ భరోసా..
ఈవార్తను కూడా చదవండి: పరిగిలో పట్టపగలే చోరీ
ఈవార్తను కూడా చదవండి: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News