Hero Vijay: హీరో విజయ్‌కి ‘వై’ కేటగిరి భద్రత.. విషయం ఏంటంటే...
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:28 AM
ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత జోసఫ్ విజయ్‌కి(Joseph Vijay) ‘వై’ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ(Union Home Ministry) ఉత్తర్వులు జారీ చేసింది.

- కేంద్ర హోంశాఖ ఆదేశం
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత జోసఫ్ విజయ్‌కి(Joseph Vijay) ‘వై’ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ(Union Home Ministry) ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ రాజకీయ పార్టీ ప్రథమ వార్షికోత్సవం ఇటీవలే ముగిసింది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishore)ను ప్రత్యేక సలహాదారుడిగా నియమించుకున్న విషయం తెలిసిందే.
ఈ వార్తను కూడా చదవండి: Dawat Biryani Hotel: బిర్యానీ తెచ్చిన తంటా.. కస్టమర్లను కొట్టిన హోటల్ నిర్వాహకులు
ఈ నెల 26వ తేదీ పార్టీ సర్వసభ్యమండలి సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం విజయ్‌కి ‘వై’ కేటగిరీ భద్రత కల్పించాని నిర్ణయించింది. అంటే ఆయనకు నిత్యం 8 నుంచి 11 మంది సీఆర్‌పీఎఫ్(CRPF) జవాన్లతో భద్రత కల్పించనున్నారు. అయితే వై కేటగిరి భద్రత రాష్ట్రంలో మాత్రమే వుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇదిలా వుండగా రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ అభిమానులూ అధికమే. అందువల్ల ఆయన వెళ్లే ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగే అవకాశముందన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు భద్రత కల్పించనుంది.
ఆ భద్రత ఎందుకో ? అన్నాడీఎంకే
విజయ్‌కి ‘వై’ కేటగిరి భద్రతపై అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునస్వామి స్పందించారు. పార్టీ అధినేతగా, అభిమానుల తాకిడి వుందన్న ఉద్దేశంతో విజయ్‌కు భద్రత కల్పిస్తే సంతోషమేనని, కానీ రాజకీయ లబ్ధి పొందేందుకు, విజయ్‌ని ప్రసన్నం చేసుకునేందుకు భద్రత కల్పిస్తే మాత్రం సరికాదన్నారు. బీజేపీ(BJP) గత చరిత్రను పరిశీలిస్తే విజయ్‌కు ఎందుకు భద్రత కల్పించారో ఇట్టే తెలిసిపోతుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు
ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
Read Latest Telangana News and National News