Jayalalitha Assets: అమ్మ ఆస్తులు.. పూర్తయిన అప్పగింతలు
ABN , Publish Date - Feb 16 , 2025 | 07:52 PM
Jayalalitha Assets: తమిళ ప్రజల ఆరాధ్య దైవం అమ్మగా జయలలిత ఖ్యాతి పొందారు. 2016 డిసెంబర్‌లో ఆమె తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో మరణించారు. అయితే పలుమార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు.

బెంగళూరు, ఫిబ్రవరి 16: తమిళనాడు మాజీ సీఎం, ప్రముఖ సినీ నటి జయలలితకు సంబంధించిన ఆస్తులు, ఆస్తి పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అందించే ప్రక్రియ శనివారం పూర్తయిందని కర్ణాటక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ జవళి వెల్లడించారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, ఆస్తులను భద్రపరచడంతోపాటు సిబ్బంది నియామకం తదితర అంశాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.13 కోట్లు కర్ణాటకకు అందాయని తెలిపారు.
జయలలితకు చెందిన 27 కిలోల బంగారంతోపాటు వజ్రాభరణాల్లో 1.5 కిలోల పుత్తడి కత్తి సైతం ఉందని వివరించారు. ఇక పొలాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులతోపాటు11,300 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీలు, 8 వీసీఆర్‌లు, 740 జతల పాదరక్షలు, 610 వెండి వస్తువులు, 27 కిలోల బంగారు ఆభరణాలు ఆ జాబితాలో ఉన్నాయని వివరించారు.
7,040 గ్రాముల 468 వజ్రఖచిత బంగారు ఆభరణాలతో కలిపి మొత్తం 1606 వస్తువులను ట్రంకు పెట్టెల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని చెప్పారు. శనివారానికి ఆ రాష్ట్ర అధికారులు సరిచూసుకోవడంతో న్యాయసంబంధ వ్యవహారం పూర్తయిందని తెలిపారు.
Also Read : ఏపీలో జీబీఎస్ తొలి మరణం.. అప్రమత్తమైన ప్రభుత్వం
తమిళ ప్రజల ఆరాధ్య దైవం అమ్మగా జయలలిత ఖ్యాతి పొందారు. 2016 డిసెంబర్‌లో ఆమె తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో మరణించారు. అయితే పలుమార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు సైతం వెళ్లారు. ఆమె పాలనలో ఈ కేసులపై ప్రభావం చూపే అవకాశముందని డీఏంకే భావించింది. అందులోభాగంగా ఈ కేసుు కర్ణాటకలోని పరప్పన్ అగ్రహారానికి బదిలీ చేశారు.
Also Read : పద్ధతి మార్చుకోని యూఎస్.. కాళ్లకు, చేతులకు బేడీలు
Also Read : 104 ఏళ్ల బామ్మ.. జైలుకు ఎందుకు వెళ్లిందంటే..?
నాటి నుంచి ఈ కేసు అంతా అక్కడి న్యాయ స్థానంలోనే సాగింది. అయితే జయలలిత ఆస్తులు తమకు చెందాలంటూ.. ఆమె వారసులం తామేనంటూ పలువురు బంధువులు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. కానీ జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి చెందాలంటూ న్యాయస్థానం స్పష్టమైన తీర్పు వెలువరించింది.
Also Read: ఇద్దరు పిల్లలున్న తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. తర్వాత తల పట్టుకున్నాడు.. ఎందుకంటే..?
Also Read : సీఎం రేవంత్‌కి బీజేపీ ఎంపీ సవాల్
ఈ నేపథ్యంలో పరప్పన్ అగ్రహారంలోకి న్యాయ స్థానంలో ఉన్న ఆమెకు సంబంధించిన స్థిర, చర ఆస్తులకు.. ఆరు ట్రంక్ పెట్టల మధ్య తమిళనాడు అధికారులకు.. కర్ణాటక న్యాయ స్థానం.. ఆ రాష్ట్ర ఉన్నతాధికారుల సమక్షంలో అందజేశారు. భారీ భద్రత నడుమ జయలలిత ఆస్తులను తమిళనాడుకు తరలించారు.
For National News And Telugu News