Share News

Happy New Year-2025: దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి..

ABN , Publish Date - Jan 01 , 2025 | 10:41 AM

నూతన సంవత్సరం 2025లో ప్రజలందరికీ ఆనందం, సామరస్యం, శ్రేయస్సు కలగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. భారతదేశంతోపాటు ప్రపంచానికీ ప్రకాశవంతమైన, సమగ్రమైన, స్థిరమైన భవిష్యత్తును సృష్టించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

Happy New Year-2025: దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి..
Happy New Year 2025 Wishes

ఢిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025వ సంవత్సరంలో దేశ ప్రజలందరికీ కొత్త అవకాశాలు, విజయాలు, అంతులేని ఆనందాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని దేవుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ, రాష్ట్రపత్రి ద్రౌపదీ ముర్ము కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


"ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలు, విజయం, అంతులేని ఆనందాన్ని తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి" అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


నూతన సంవత్సరం 2025లో ప్రజలందరికీ ఆనందం, సామరస్యం, శ్రేయస్సు కలగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. భారతదేశంతోపాటు ప్రపంచానికీ ప్రకాశవంతమైన, సమగ్రమైన, స్థిరమైన భవిష్యత్తును సృష్టించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. భారత్‌కు ప్రకాశవంతమైన, సమగ్రమైన, స్థిరమైన భవిష్యత్తు సృష్టించడం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. దేశం పట్ల ప్రజలు తమ నిబద్ధత పునరుద్ధరించాలని ఎక్స్ వేదికగా ద్రౌపది ముర్ము కోరారు.


దేశవ్యాప్తంగా ప్రార్థనలు..

మరోవైపు దేశప్రజలందరూ 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. దేశంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలందరూ టపాసులు కాలుస్తూ.. కేకులు కట్ చేస్తూ నూతన సంవత్సరానికి ఘనంగా వెల్‪కమ్ చెప్పారు. మరోవైపు తెల్లవారుజాము నుంచే దేశవ్యాప్తంగా ఉన్న చర్చిలు, ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వివిధ రకాల పూజలు, నైవేద్యాలతో కొత్త సంవత్సరంలో తమకు అండగా ఉండాలని కోరుకున్నారు. 2025లో మొదటి రోజు కావడంతో పవిత్ర స్థలాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇసుక వేస్తే రాలనంత జనం దేవుళ్లను దర్శించుకుంటున్నారు. ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో ఈ సంవత్సరం మొదటి హారతి నిర్వహించగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Updated Date - Jan 01 , 2025 | 10:48 AM