RSS New Complex : సేవకుల కొత్త ఇల్లు.. 300 గదుల నిర్మాణానికి ఎన్ని కోట్లో తెలిస్తే..
ABN , Publish Date - Feb 13 , 2025 | 03:32 PM
RSS New Head Quarters Delhi : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) దేశ రాజధాని న్యూఢిల్లీలో కొత్త ఇంటిలోకి ప్రవేశించింది. అత్యాధునిక సదుపాయాలతో ఆకర్షణీయంగా నిర్మించిన ఈ అద్భుతమైన భవనం పేరు.. 'కేశవ్‌కుంజ్'. గుజరాత్ ఆర్కిటెక్ట్ అనూప్ డేవ్ సారథ్యంలో రూపొందించిన ఈ RSS కార్యాలయంలో ఫిబ్రవరి 19 నుంచి పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం...

RSS New Head Quarters Delhi : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దేశ రాజధాని న్యూఢిల్లీలో కొత్త ఇంటిలోకి ప్రవేశించింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మరలా అసలు కార్యాలయానికి తిరిగి వచ్చింది. గుజరాత్ ఆర్కిటెక్ట్ అనూప్ డేవ్ సారథ్యంలో రూపొందించిన ఈ అద్భుతమైన భవనం పేరు 'కేశవ్‌కుంజ్'. కొత్తగా నిర్మించిన ఈ భవనం విస్తీర్ణం దాదాపు 4 ఎకరాలు. అత్యాధునిక సదుపాయాలు, ఆకర్షణీయంగా నిర్మించిన మూడు 13 అంతస్తుల భవనంలో ఫిబ్రవరి 19 నుంచి పార్టీ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
"కేశవ్ కుంజ్"లో 300లకు పైగా గదులు..
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కొత్త హెడ్ క్వార్టర్స్ పేరు "కేశవ్ కుంజ్". మూడు హై రైజ్ టవర్లకు సాధన, ప్రేరణ, అర్చన అని పేరు పెట్టారు. 13 అంతస్థులున్న ఈ బిల్డింగుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన 300లకు పైగా గదులున్నాయి. దాదాపు 8 ఏళ్ల నిర్మాణం అనంతరం మళ్లీ ఆర్ఎస్ఎస్ ఇందులోకి ప్రవేశించింది. ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగత్ ఆధ్వర్యంలో ఈ నెల 19న కార్య సేవకుల సమావేశం అందులో జరగబోతోంది. ఆఫీస్ కార్యకలాపాలకు సాధన బిల్డింగ్,10 వ అంతస్తులో 8,500 పుస్తకాలతో లైబ్రరీ. ప్రేరణ టవర్ లో మొదటి అంతస్తులో హనుమాన్ టెంపుల్ ఉండగా అర్చన టవర్ కార్యసేవకులకు ఉద్దేశించింది.
విశ్వ హిందూ పరిషత్ నేత పేరిట ఆడిటోరియం..
కొత్త భవనంలో 3 పెద్ద ఆడిటోరియాలు ఏర్పాటుచేశారు. అందులో ఒకటి విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అశోక్ శింఘాల్ పేరిట 450 సీట్లతో నెలకొల్పగా.. 650 సీట్లూ, 250 సీట్లతో మరో రెండు ఆడిటోరియం లను నిర్మించారు. ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్‍లో సోలార్ విద్యుత్, వుడ్ బదులు గ్రానైట్ ఫ్రేంస్ ఏర్పాటు చేశారు. ప్రేరణ, అర్చన టవర్ల మధ్య ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్జెవార్ విగ్రహం నెలకొల్పారు.
చిన్న గదిలో మొదలై.. ఇప్పుడు రూ.150కోట్ల భవంతిలోకి..
బీజేపీ సైద్దాంతిక గురువు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ 1939 లో నాగ్‌పూర్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. 1961 లో దేశరాజధాని ఢిల్లీలోని చిన్న ఇంటికి మార్చింది. 1969, 1980లో ఒకటి, రెండు అస్తులను నిర్మించుకొని అందులోనే కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చింది. మారిన అవసరాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మాణానికి 2018 లో మోహన్ భగత్ శంకుస్థాపన చేశారు. కేశవ్ కుంజ్ నిర్మాణానికి అయిన ఖర్చు అక్షరాలా రూ.150 కోట్లు. రూ.5 నుంచి మొదలుకుని 75వేల మంది ఈ నిర్మాణం కోసం విరాళాలు అందించారంట.
ఇవి కూడా చదవండి..
Congress: కాంగ్రెస్‌కు కొత్త సారథి.. పార్టీ అధ్యక్షుడి మార్పుపై జోరుగా ఊహాగానాలు
Supreme Court: ఆయన మంత్రిగా కొనసాగడం అవసరమా..
Hero Vijay: టీవీకేలో అనుబంధ విభాగాలు.. ప్రకటించిన అధ్యక్షుడు విజయ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..