Share News

Hero Vijay: టీవీకే వార్షికోత్సవాలకు సమన్వయ కమిటీ..

ABN , Publish Date - Feb 25 , 2025 | 12:43 PM

తమిళగ వెట్రి కళగం వార్షికోత్సవాల నిర్వహణ కోసం 18 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ నేత, సినీ నటుడు విజయ్‌(Film actor Vijay) ప్రకటించారు. ఈ నెల 26న మహాబలిపురంలో జరిగే వార్షికోత్సవాలకు జాతీయ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Hero Vijay: టీవీకే వార్షికోత్సవాలకు సమన్వయ కమిటీ..

- పుదువై సీఎం రంగస్వామికి ఆహ్వానం

చెన్నై: తమిళగ వెట్రి కళగం వార్షికోత్సవాల నిర్వహణ కోసం 18 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ నేత, సినీ నటుడు విజయ్‌(Film actor Vijay) ప్రకటించారు. ఈ నెల 26న మహాబలిపురంలో జరిగే వార్షికోత్సవాలకు జాతీయ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమన్వయ కమిటీలో చెంగల్పట్టుకు చెందిన సూర్యనారాయణన్‌, ఎంజీకే మోహన్‌రాజా, ఎంఎస్‌ బాలాజీ, వీ నరేంద్రన్‌, తిరుప్పోరూరుకు చెందిన సీవీ దీనా, వీకేఆర్‌ త్యాగు, ఎం.రాజేశ్‌, వి.రమేష్‌, ఎన్‌.సుకి గణేష్‌, కె.దేవా, ఎస్‌. విశ్వనాథన్‌, వి.హేమ, వి.విజయదేవి, ఎన్‌.పుష్పరాజ్‌, పి.భవానీ, కె. గౌతమ్‌, కె.కన్నన్‌, మధురాంతకంకు చెందిన ఎస్‌.జాన్‌ రాజేష్‌ సభ్యులుగా ఉంటారని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. పరిస్థితి ఎలా ఉందంటే..


పార్టీ ప్రారంభించి యేడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలో లక్షలాదిమంది కార్యకర్తలు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి పనయూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం రాత్రంతా పార్టీ నాయ కులతో విజయ్‌ చర్చలు జరిపారు. అదే సమయంలో పార్టీ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేవారికి పాస్‌లు కూడా అందజేశారు. ఈ వేడుకల్లో పార్టీ సర్వసభ్యమండలి, కార్యాచరణ మండలి సమావేశాల తేదీలను కూడా విజయ్‌ ప్రకటించనున్నారు.


విజయ్‌ పార్టీతో పొత్తుపై పరిశీలన: రంగస్వామి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ తమిళనాట ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవటం ఖాయమేనని ఆ పార్టీ నేత, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి తెలిపారు. సోమవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తమిళగ వెట్రి కళగం ప్రదాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ తనకు చిరకాల స్నేహితుడని, పార్టీ నేత విజయ్‌తో కూడా పరిచయాలు న్నాయని చెప్పారు.


ఎన్‌ఆర్‌కాంగ్రెస్ కు తమిళనాట కూడా స్పందన వస్తోందని, ఇటీవల వేలూరుకు చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలో చేరారని తెలిపారు. పార్టీ శ్రేణుల చిరకాల కోరిక మేరకే తమిళనాట ఈసారి కొన్ని పార్టీలతో పొత్తుపెట్టుకుంటామన్నారు. విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రికళగంతో పొత్తుపై ఎన్నికలు సమీపించే కాలంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 12:47 PM