Share News

Diva Jaimin Shah : ఆమె గురించే అందరి ఆరా!

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:31 AM

దివా జైమిన్‌ షా..... గౌతమ్‌ అదానీకి కాబోయే చిన్న కోడలిగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌లో పాల్గొన్న అదానీ కుటుంబం ... ఫిబ్రవరి 7న జీత్‌ అదానీ, దివాల వివాహాన్ని సంప్రదాయ రీతిలో జరిపిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈమె గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

 Diva Jaimin Shah : ఆమె గురించే అందరి ఆరా!
Adani Family

దివా జైమిన్‌ షా..... గౌతమ్‌ అదానీకి కాబోయే చిన్న కోడలిగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌లో పాల్గొన్న అదానీ కుటుంబం ... ఫిబ్రవరి 7న జీత్‌ అదానీ, దివాల వివాహాన్ని సంప్రదాయ రీతిలో జరిపిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈమె గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ దివా జైమిన్‌ షా?

దేశంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్‌ షా కూతురే దివా. వజ్రాల తయారీ సంస్థల్లో పేరుగాంచిన ‘సి. దినేష్‌ అండ్‌ కో ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సహ యజమాని కూడా. సూరత్‌, ముంబైలలో పలు కేంద్రాలను నెలకొల్పి వజ్రాల వ్యాపారంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అంతేకాదు తండ్రి మార్గనిర్దేశకత్వంతోపాటు జిగర్‌ దోషి, అమిత్‌ దోషి, యోమేష్‌ షా వంటి బృంద సభ్యుల సహకారంతో వ్యాపారాన్ని గ్లోబల్‌ డైమండ్‌ మార్కెట్‌ స్థాయికి చేర్చారు. నెదర్లాండ్స్‌, హాంకాంగ్‌లలోనూ కార్యాలయాలు స్థాపించారు. సామాజిక మాధ్యమాల్లో దివా యాక్టివ్‌గా ఉండరు. అయితే ఫైనాన్స్‌, వ్యాపార రంగాలకు సంబంధించి పలు అంశాల్లో ఆమెకు మంచి పట్టు ఉంది. ఇదే అదానీ కుటుంబాన్ని బాగా ఆకర్షించింది.

సాదాసీదాగా పెళ్లి!

ఇరు కుటుంబాలు ధనిక వర్గానికి చెందినవే కావడంతో వివాహం చాలా గ్రాండ్‌గా జరుగుతుందనీ, దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తారనీ ఊహాగానాలు వినిపించాయి. కానీ పెళ్లి సాదాసీదాగా సంప్రదాయ పద్ధతిలో జరుగుతుందని గౌతమ్‌ అదానీ చెప్పారు. 2023 మార్చి 14న జీత్‌, దివాల నిశ్చితార్థం కాగా గత డిసెంబరులో ఉదయ్‌పూర్‌లో ప్రీ వెడ్డింగ్‌ ఫంక్షన్‌ జరిగింది. జీత్‌ అదానీ ప్రస్తుతం అదానీ గ్రూప్‌ ఫైనాన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్‌, అదానీ డిజిటల్‌ ల్యాబ్స్‌ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 11:40 AM