Lizard : గోడ మీద బల్లి ఉందా.. తరిమికొట్టేందుకు ఇలా చేయండి..
ABN, Publish Date - Mar 19 , 2025 | 11:59 AM
How to Get Rid Of Lizards From Home : ఇల్లు ఎంత శుభ్రం చేసుకున్నా కిచెన్, బాత్రూం, బెడ్రూం, హాల్ అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ చికాకు పెడుతుంటాయి బల్లులు. వీటి దెబ్బకు చాలామంది నిద్రపోవాలంటేనే భయపడతారు. మీ ఇంట్లో నుంచి వీటిని శాశ్వతంగా తరిమేసేందుకు ఈ సింపుల్ హోం చిట్కాలు పాటించండి.

సైజులో చిన్నగా కనిపించే బల్లలు చాలా విషపూరితం. ఇవి ఇంట్లో ఎక్కడపడితే తిరుగుతూ ఉంటే చూసేందుకు అసహ్యంగానే కాదు. పొరపాటున వంటల్లో పడిపోతుందేమో లేకపోతే మీద పడుతుందేమో అనే భయమూ ఉంటుంది.

కొందరికి బల్లి పేరు విన్నా, వాటిని ప్రత్యక్షంగా చూసినా ఒళ్లంతా ముచ్చెమటలు పోస్తాయి. భయంతో వణికిపోతారు. దీనినే హెర్పెటోఫోబియా అంటారు. ఇలాంటివారు బల్లి ఇంట్లో ఉందంటే ఒక పట్టాన కుదురుగా కూర్చోలేరు.

వంటగదిలో బల్లులు తిరుగుతూ ఉంటే ఈ సింపుల్ చిట్కాలు అనుసరించండి. అది తరచూ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఉల్లిపాయ ముక్కలుగా కోసి ఉంచండి. వీలైతే తీగకు కట్టి వేలాడదీయండి. ఆ ఘాటుకు బల్లి అటువైపుకి రానేరాదు.

వెల్లుల్లికి కూడా ఉల్లిపాయలాగే ఘాటైన వాసన ఉంటుంది. దీనిని కోసి తలుపులు, కిటీకీల మధ్యగా ఉంచితే బల్లులు వాటిమధ్యగా తిరగవు లేదా వెల్లుల్లి ముద్దను నీళ్లలో కలిపి ఇంట్లో స్ప్రే చేసినా బల్లుల బాధ తప్పుతుంది.

పెప్పర్ స్ప్రే ఘాటు కూడా ఇంట్లో ఉన్న బల్లులను తరిమేస్తుంది. దీన్ని మార్కెట్లో అయినా కొనుక్కోండి లేదా ఇంట్లోనే కాసిన్ని మిరియాలను పొడి చేసి వాటిని నీటిలో కలిపి స్ప్రే చేసినా ఫలితం కనిపిస్తుంది.

ఇంట్లో బల్లులు తిరిగే ప్రదేశాల్లో చిల్లీ స్ప్రే చల్లినా అవి అక్కడ నుంచి పారిపోతాయి. ఇందులోని ఘాటైన వాసనలే బల్లులన్ని ఇంట్లోకి రాకుండా నిరోధిస్తాయి.
Updated at - Mar 19 , 2025 | 12:15 PM