Astronauts : అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపింది వీళ్లే..
ABN, Publish Date - Mar 20 , 2025 | 06:26 PM
Astronauts : సునీతా విలియమ్స్ అత్యధిక సమయం అంతరిక్షంలో గడిపి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ లో భూమికి తిరిగి వచ్చాక ఎవరెక్కువ రోజులు స్పేస్ లో ఉన్నారనే చర్చ మొదలైంది. ఆ జాబితాలో టాప్ లో ఉన్న వ్యోమగాములు వీళ్లే..

Astronauts : నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ 9 నెలల 12 రోజుల సుదీర్ఘకాలం అంతరిక్ష కేంద్రంలో గడిపి మొత్తానికి భూమికి తిరిగొచ్చారు.

సునీతా విలియమ్స్ రాక నేపథ్యంలో ఏ వ్యోమగామికి అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన రికార్డు ఎవరికి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

సోషియాలజీలో పిహెచ్‌డి చేసిన పెగ్గీ వాట్సన్ నాసా వ్యోమగామి. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన ఆస్ట్రోనాట్ ఈమె. ఏకంగా 675 రోజులు ఉన్నారు.

మూడు అంతరిక్ష మిషన్లు కలిపితే మార్చి 18, 2025 నాటికి భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 608 రోజులు అంతరిక్షంలో గడిపారు.

నాసా వ్యోమగామి జెఫ్ విలియమ్స్ నాలుగు మిషన్లలో మొత్తం 534 రోజులు అంతరిక్షంలో గడిపారు.

మార్క్ వందే హే రెండు మిషన్లలో మొత్తం 523 రోజులు అంతరిక్షంలో గడిపాడు. ఒక్క పర్య.టనలోనే 355 రోజులు ఉన్నారు.

అమెరికన్ వ్యోమగామి స్కాట్ కెల్లీ నాలుగు మిషన్లలో మొత్తం 520 రోజులు అంతరిక్షంలో గడిపాడు

బుచ్ విల్మోర్ ఇప్పటివరకు మూడు మిషన్లలో మొత్తం 462 రోజులు అంతరిక్షంలో గడిపాడు.
Updated at - Mar 20 , 2025 | 06:30 PM