Share News

Air Hostess to pig farmer: ఎయిర్ హోస్టస్ జాబ్‌కు గుడ్ బై చెప్పి పందుల పెంపకం! 2 నెలలు తిరిగే సరికల్లా..

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:45 PM

ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగాన్ని కాలదన్ని పందుల పెంపకం చేపట్టిన ఓ మహిళ అంతకుమునుపు కంటే పది రెట్లు అధికంగా సంపాదించడం ప్రారంభించింది. చైనాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Air Hostess to pig farmer: ఎయిర్ హోస్టస్ జాబ్‌కు గుడ్ బై చెప్పి పందుల పెంపకం! 2 నెలలు తిరిగే సరికల్లా..

ఇంటర్నెట్ డెస్క్: నేటి యువతరం కొత్త పంథాను అనుసరించేందుకు ఏమాత్రం వెనకాడట్లేదు. లక్షలు ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగాలను సైతం కాదనుకుని తమకు నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకుంటున్నారు. చైనాకు చెందిన ఓ యువతి తాజాగా ఇదే చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఆమె ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఏకంగా పందుల పెంపకం మొదలెట్టింది. ఆ తరువాత రెండు నెలలకే ఆమె జీవితం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా (Viral) మారిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..

హెయిలోంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన యాంగ్‌ యాంగ్జీ దాదాపు ఐదేళ్ల పాటు ఎయిర్ హోస్టస్‌గా పనిచేసింది. చదువు పూర్తి కాగానే ఆమె ఫ్లైట్ అటెండెంట్‌గా చేరింది. కానీ, 2022లో జాబ్‌కు రాజీనామా చేసి స్వగ్రామానికి వచ్చేసింది. అప్పటికే ఆమె తల్లి ఆరోగ్యం కూడా బాలేకపోవడంతో ఇంటి వద్దే ఉండిపోయింది (Air Hostess turns Pig farmer).


Viral: మిలిటరీ కత్తి చేతబూని స్టెప్పులేసిన అమెరికా అధ్యక్షుడు.. ట్రంప్ సంబరం చూసి సైనికాధికారులకు టెన్షన్!

రాజీనామాకు ముందు తన శాలరీ 380 డాలర్లుగా ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది. షాంఘాయ్‌లో ఉండేటప్పుడు తన తల్లిదండ్రులు తనను ఆర్థికంగా ఆదుకునే క్రమంలో అప్పులపాలయ్యారని కూడా చెప్పింది. తల్లిదండ్రులు పంపించిన డబ్బుతోనే తాను విలాసాలపై ఖర్చు చేసేదాన్నని కూడా చెప్పింది. చివరకు ఆమెను పశ్చాత్తాపం ఆవరించడంతో ఎయిర్ హోస్టస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికొచ్చేసింది.

ఇక 2023 ఏప్రిల్‌లో ఆమె తన బంధువులకు చెందిన పందుల షెడ్డును తీసుకుని వ్యాపారంలోకి దిగింది. అంతేకాకుండా, తన జర్నీకి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ ఉండేది. ఆమె అసాధారణ నిర్ణయం నెటిజన్లను అమితంగా ఆకట్టుకోవడంతో చూస్తుండగానే ఆమె ఫాలోవర్ల సంఖ్య 1.2 మిలియన్‌లకు చేరింది.


Viral: ట్రంప్ ప్రమాణస్వీకారం.. జో బైడెన్ రియాక్షన్ వైరల్

ఇక తన వీడియోల్లో ఎప్పుడూ అందమైన దుస్తులు ధరించి కనిపించే యాంగ్.. పందులకు మేత వేస్తూనో లేదా మరో పని చేస్తూనో కనిపించేది. ‘పందుల పెంపకం కోసం నేను చాలా కష్టపడేదాన్ని. మితిమీరిన పనితో వెన్ను నొప్పి కూడా వచ్చింది. కానీ నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. పందుల పెంపకం చేపట్టిన రెండు నెలలకే నా సంపాదన 28 వేల డాలర్లకు చేరుకుంది’’ అని ఆమె సంబరపడిపోతూ చెప్పింది. ప్రస్తుతం తాను తన వ్యాపారాన్ని మరింత విస్తరించే పనిలో ఉన్నట్టు తెలిపింది.

Read Latest and Viral News

Updated Date - Jan 23 , 2025 | 04:52 PM