Funny Viral Video: మందుబాబులకు ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి.. పర్సులో అతను ఏం దాచాడో చూడండి..
ABN , Publish Date - Feb 03 , 2025 | 08:54 AM
మందుబాబులకు సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. మద్యం సేవించిన తర్వాత మాత్రమే కాదు.. మద్యపానం కోసం వారు చేసే ప్రయత్నాలు కూడా ఒక్కోసారి నవ్వు తెప్పిస్తుంటాయి.

మందు బాబుల (Drunken Man) తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. మద్యం సేవించిన తర్వాత మాత్రమే కాదు.. మద్యపానం (Liquor) కోసం వారు చేసే ప్రయత్నాలు కూడా ఒక్కోసారి నవ్వు తెప్పిస్తుంటాయి. వారు చాలా సార్లు సకల ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటారు. మందుబాబులకు సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలు (Funny Videos) ఇప్పటివరకు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. hutiyagram అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది (Viral Video).
సాధారణంగా ఎవరైనా తన ప్యాంట్ జేబులో పెట్టుకునే పర్సులో (Wallet) డబ్బులు లేదా విలువైన పేపర్లు, దేవుడి ఫొటోలు పెట్టుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి తన పర్సులో ఏం పెట్టుకున్నాడో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే. ఆ వీడియోలోని వ్యక్తి ఓ చోట కూర్చుని మద్యం సీసా ఓపెన్ చేశాడు. ఆ తర్వాత తన బ్యాక్ పాకెట్‌లో నుంచి ఓ పర్సు తీశాడు. ఆ పర్సులో ఓ డిస్పోజబుల్ గ్లాస్‌ను మడతలు పెట్టి ఉంది. అతడు ఆ గ్లాజును జాగ్రత్తగా బయటకు తీసి అందులో ఆల్కహాల్ వేసుకుని తాగేశాడు. చాలా మంది మందుబాబులు గ్లాస్ అందుబాటులో లేకపోతే ఇబ్బందులు పడుతుంటారు. ఈ వ్యక్తి ముందు జాగ్రత్తగా గ్లాస్‌ను తనతో పాటే ఉంచుకుంటున్నాడు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ ఫన్నీ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించి, వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఇతను మాత్రమే పర్సును సరిగ్గా ఉపయోగిస్తున్నాడు``, ``మందు బాటిల్‌ను దాచడానికి కూడా ఏవైనా ట్రిక్స్ చెప్పండి``, ``ఇది ముందు జాగ్రత్త చర్య`` అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Weight Loss: కేవలం 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ప్రాణం పోతున్నా ఆహారాన్ని వదలని కొండచిలువ.. చివరకు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి