Weight Loss: కేవలం 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:47 PM
వేగంగా బరువు తగ్గేందుకు కొందరు విపరీతంగా వ్యాయామం చేయడం, కఠినమైన డైట్‌లను ఫాలో కావడం వంటి పనులు చేస్తుంటారు. ఆ క్రమంలో బరువు తగ్గినప్పటికీ తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతారు. నెలకు రెండు కిలోలకు మించి బరువు తగ్గడం చాలా ప్రమాదాలకు కారణమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

కొందరు బరువు తగ్గడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని ఏళ్ల పాటు పెరిగిన బరువును రోజులు, నెలల వ్యవధిలో తగ్గించేసుకోవాలనుకుంటారు. విపరీతంగా వ్యాయామం (Workouts) చేయడం, కఠినమైన డైట్‌లను ఫాలో కావడం వంటి పనులు చేస్తుంటారు. ఆ క్రమంలో బరువు తగ్గినప్పటికీ తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతారు. నెలకు రెండు కిలోలకు మించి బరువు తగ్గడం చాలా ప్రమాదాలకు కారణమవుతుందని డాక్టర్లు చెబుతున్నప్పటికీ చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. అందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు. (Weight Loss)
ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల జిమ్ ట్రైనర్ భారీగా బరువు తగ్గించుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. కఠినమైన డైట్ ఫాలో అవుతూ జిమ్‌లో గంటలు గంటలు గడిపి వర్కవుట్లు చేశాడు. ఫలితంగా 15 రోజుల్లోనే పది కేజీలు తగ్గాడు (Man loses 10 kg in 15 days). తన శరీర బరువులో 13 శాతాన్ని కేవలం రెండు వారాల్లో తగ్గించుకున్నాడు. అయితే అకస్మాత్తుగా అతడి కుడి పాదంలో సమస్య మొదలైంది.
అతడు తన కుడి కాలును పైకి ఎత్తలేకపోయాడు. పాదాన్ని కనీసం కదపలేకపోయాడు. దీంతో అతడిని వెంటనే ఎయిమ్స్‌కు తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతి వ్యాయామమే అతడి స్థితికి కారణమని నిర్ధారించారు. అకస్మాత్తుగా బరువు తగ్గిన సందర్భాల్లో అరికాళ్లల్లో ఉండే కొవ్వు పొర తగ్గిపోతుంది. ఫలితంగా, కాలి కదలికలు, స్పర్శకు కారణమయ్యే నాడీ కణాలపై ఒత్తిడి పెరుగుతుంది. చివరకు కాల్లో స్పర్శ తగ్గి, కదపలేని స్థితి వస్తుంది.
బరువు తగ్గేందుకు జిమ్‌లో అధికంగా కసరత్తు చేసేవారు ఈ సమస్య బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. దీనిని వైద్య పరిభాషలో దీన్ని పెరోనియల్ న్యూరోపతీ అని అంటారు. ఇది తాత్కాలిక పక్షవాతం లాంటిది. ఇది చాలా అరుదైన కేస్ అని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ సమస్యను ఆదిలోనే గుర్తించి చికిత్స అందించకపోతే శాశ్వత పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల భుజాలు స్థానభ్రంశం చెందుతాయని, మెడ, వెన్ను నొప్పులు మొదలవుతాయని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ప్రాణం పోతున్నా ఆహారాన్ని వదలని కొండచిలువ.. చివరకు..
Optical Illusion: ఈ రంగు రంగుల రామచిలుకల మధ్య సీతాకోక చిలుక ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
Tooth sticks in Kumbh Mela: ప్రేయసి ఐడియా అదిరిందిగా.. కుంభమేళాలో వేప పుల్లలు.. వేలల్లో సంపాదన..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి