Share News

Crocodile Attack: నటిస్తూ వేటాడడమంటే ఇదే.. ఈ మొసలి నిర్వాకమేంటో మీరే చూడండి..

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:20 PM

మూడు మేకలు ఓ కాలువ ఒడ్డున మేత మేస్తుంటాయి. ఈ క్రమంలో అవి నీరు తాగేందుకు కాలువ సమీపానికి వెళ్తాయి. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ మొసలి.. వేట కోసం వేచి చూస్తూ ఉంటుంది. మేకలను చూడగానే ..

Crocodile Attack: నటిస్తూ వేటాడడమంటే ఇదే.. ఈ మొసలి నిర్వాకమేంటో మీరే చూడండి..

పులులు, సింహాలు వంటి క్రూర జంతువలు కొన్నిసార్లు ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. అలాగే మొసళ్లు కూడా ఏంతో నేర్పుతో వేటాడేస్తుంటాయి. కొన్నిసార్లు అవి వేట కోసం గంటలు గంటలు కదలకుండా ఉండిపోయిన సందర్భాలను కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి మేకను ఎంతో తెలివిగా వేటాదింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘నటనలో ఈ మొసలికి అవార్డ్ ఇవ్వొచ్చు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మూడు మేకలు ఓ కాలువ ఒడ్డున మేత మేస్తుంటాయి. ఈ క్రమంలో అవి నీరు తాగేందుకు కాలువ సమీపానికి వెళ్తాయి. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ మొసలి.. వేట కోసం వేచి చూస్తూ ఉంటుంది. మేకలను చూడగానే మొసలి కదలకుండా అలాగే ఉండిపోతుంది. మొసలి మట్టి రంగులో ఉండడంతో మేకలకు ఎలాంటి అనుమానం రాలేదు. దాని ముందే అటూ, ఇటూ తిరుగుతూ సందడి చేస్తున్నాయి.

Viral Video: అవి దంతాలా లేక ఇనుక కడ్డీలా.. ఈ బాలుడి విన్యాసం చూస్తే షాకవ్వాల్సిందే..


అయితే ఆ మొసలి మాత్ర కదలకుండా పడుకురని అదును కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో చివరకు వాటిలో ఓ మేక మొసలి సమీపానికి వెళ్తుంది. దీంతో అప్పటిదాకా కామ్‌గా ఉన్న మొసలి కాస్తా.. ఒక్కసారిగా తన విశ్వరూపం చూపిస్తుంది. తలపైకి లేపి మేకను (crocodile attacked the goat) పట్టుకోవడానికి వెంటపడుతుంది. మొసలి దాడి నుంచి తప్పించుకునేందుక మేక కూడా పరుగులు పెడుతంది. ఈ క్రమంలో నేరుగా వెళ్లి నీళ్లలో పడిపోతుంది. అయితే మొసలి కూడా దాని వెంటే వెళ్లి నీళ్లలో దూకేస్తుంది.

Python Attack: కొండచిలువను ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఈ ఘటనలో చివరకు మొసలి మేకను పట్టేసుకుంటుంది. చివరకు మొసలి దాడిలో ప్రాణాలు కోల్పోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసలి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. మేకను చూస్తుంటే బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2400కి పైగా లైక్‌లు, 1.95 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కొంప కూల్చే ట్రిక్స్ అంటే ఇవే.. గ్యాస్ తక్కువగా ఉందని ఇతను చేసిన నిర్వాకమిదీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 25 , 2025 | 01:20 PM