Dube-Hardik: కాటేరమ్మ కొడుకులు శివాలెత్తారు.. ఇదీ టీమిండియా అంటే
ABN , Publish Date - Jan 31 , 2025 | 08:47 PM
IND vs ENG: కాటేరమ్మ కొడుకులు చెలరేగిపోయారు. భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇంగ్లండ్‌కు చూపించారు. సిక్సర్ల సునామీలో స్టేడియాన్ని ముంచేశారు.

భారత్ అంటేనే బ్యాటర్ల అడ్డా. అద్భుతమైన స్పిన్నర్లు, టాలెంటెడ్ పేసర్లు ఉన్నా మన జట్టు బ్యాటింగ్‌కే పేరు గాంచింది. అలాంటి టీమిండియా బ్యాటింగ్ యూనిట్ ఈ మధ్య వరుసగా చేదు అనుభవాలు చవిచూసింది. వరుస వైఫల్యాలతో పరువు పోగొట్టుకుంది. టెస్టుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మన టీమ్‌కు అగ్ని పరీక్ష పెడితే.. ఇప్పుడు ఇంగ్లండ్ ఆ అగ్నికి ఆయువు పోస్తోంది. అయితే సమస్యల్లో నుంచే హీరోలు ఉద్భవిస్తారు అనే మాదిరిగా పించ్ హిట్టర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె మన బ్యాటింగ్‌కు భరోసా ఇచ్చారు. ఇంగ్లీష్ టీమ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో ఈ ఇద్దరు స్టార్లు సిక్సులు, ఫోర్లతో సునామీ సృష్టించారు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశారు.
దండయాత్ర!
పుణె టీ20లో హార్దిక్ (30 బంతుల్లో 53), శివమ్ దూబె (31 బంతుల్లో 52 నాటౌట్) శివాలెత్తారు. ఈ కాటేరమ్మ కొడుకులు ఇంగ్లండ్ బౌలర్లపై దండయాత్ర చేశారు. ఎవర్నీ విడిచిపెట్టకుండా బాదిపారేశారు. పాండ్యా 4 ఫోర్లు, 4 సిక్సులు బాదగా.. దూబె 7 ఫోర్లు 2 సిక్సులు కొట్టాడు. 3 వికెట్లు తీసి టీమిండియాను భయపెట్టిన షకీబ్ మహమూద్‌తో పాటు గత మ్యాచ్‌లో మనను దెబ్బతీసిన ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్లతో హడలెత్తించారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా? లేదా? అనే విషయాన్ని పక్కనబెడితే.. కాన్ఫిడెన్స్ కోల్పోయిన బ్యాటింగ్ లైనప్‌కు ఇది ఎక్కడలేని బూస్టప్ ఇస్తుంది. మనది బ్యాటర్ల ఖజానా అని వారిలో నమ్మకం నింపుతుంది. మెన్ ఇన్ బ్లూకు ఎదురులేదని విశ్వాసం వస్తుందని చెప్పొచ్చు. అందుకే హార్దిక్-దూబె ఇన్నింగ్స్ చాలా మెమరబుల్‌గా నిలిచిపోతుందని అనలిస్టులు అంటున్నారు. ఇక, ప్రస్తుతం భారత్ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులతో ఉంది.
ఇవీ చదవండి:
ఒకే ఓవర్‌లో 3 వికెట్లు.. భారత్ పుట్టి ముంచిన కుర్ర పేసర్
టీమిండియాకు బ్యాడ్ లక్.. టాస్‌లో ఇలా జరిగిందేంటి
కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి