Jofra Archer: భారత్‌ను రెచ్చగొడుతున్న ఆర్చర్.. ఓవరాక్షన్ చేస్తే వాయించి వదులుతారు
ABN , Publish Date - Jan 24 , 2025 | 01:58 PM
IND vs ENG: టీమిండియాను రెచ్చగొడుతున్నాడు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్. వదిలేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. మరి.. భారత బ్యాటర్లు వాయించి వదులుతారని తెలిసి కూడా అతడు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది టీమిండియా. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు సంధించిన 132 పరుగుల లక్ష్యాన్ని మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది సూర్య సేన. దీంతో 5 మ్యాచుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చెన్నైలోని చెపాక్ వేదికగా శనివారం జరగబోయే రెండో టీ20కి భారత్ సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో మన జట్టును రెచ్చగొడుతూ పలు వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్. అతడు ఏమన్నాడంటే..
కాచుకోండి!
మొదటి టీ20లో భారత బ్యాటర్లకు లక్ కలిసొచ్చిందని.. రెండో మ్యాచ్‌లో మాత్రం వారిని వదిలే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు ఆర్చర్. చాలా బంతులు గాల్లోకి లేచాయని.. అయితే పలు మిస్ క్యాచ్‌లు జరగడం, మరికొన్ని బంతులు ఫీల్డర్లకు దూరంగా గ్యాప్స్‌లో పడటంతో టీమిండియా బ్యాటర్లు సేఫ్ అయ్యారని ఆర్చర్ చెప్పాడు. ఒకవేళ క్యాచులన్నీ పట్టినా, ఫీల్డర్ల చేతుల్లో ఆ బంతులన్నీ వచ్చినా భారత టాప్, మిడిలార్డర్‌ను 40 పరుగులకే కట్టడి చేసేవారమని వ్యాఖ్యానించాడు. టీమిండియా బ్యాటర్లకు అదృష్టం బాగా కలిసొచ్చిందన్నాడు ఇంగ్లీష్ పేసర్. తొలి మ్యాచులో చేసిన తప్పులను రెండో టీ20లో రిపీట్ చేయబోమని స్పష్టం చేశాడు.
అదే దెబ్బతీసింది!
‘ఉపఖండంలో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత బ్యాటర్లు అటాకింగ్ అప్రోచ్‌తో ముందుకెళ్తున్నారు. దూకుడు మంత్రాన్ని జపిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్‌లో మేం కొన్ని మంచి చాన్సులను చేజార్చుకున్నాం. అది మా విజయావకాశాలను దెబ్బతీసింది. మా బ్యాటింగ్ సమయంలో త్వరగా వికెట్లు కోల్పోవడం తీవ్ర నష్టం కలిగించింది. ప్రత్యర్థి చేజింగ్ టైమ్‌లో పవర్‌ప్లేలో వికెట్లు తీయకపోవడంతో మ్యాచ్‌పై పట్టు సాధించలేకపోయాం. అప్పుడు వికెట్లు తీసి ఉంటే మిడిల్ ఓవర్లలో గేమ్ ఇంకోలా ఉండేది. ఆ మ్యాచ్‌లో మేం చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. నెక్స్ట్ మ్యాచ్‌లో తప్పకుండా నెగ్గుతాం’ అని ఆర్చర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఫస్ట్ టీ20లో 4 ఓవర్లు వేసిన ఈ ఇంగ్లీష్ స్పీడ్‌స్టర్ 21 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే ఆర్చర్ ఓవరాక్షన్‌పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. కావాలనే రెచ్చగొడుతున్నాడని.. భారత బ్యాటర్లు అతడ్ని వాయించి వదులుతారని కామెంట్స్ చేస్తున్నారు. రెచ్చగొడితే ఔట్ అవుతారనే స్ట్రాటజీతో ఇలా చేస్తున్నాడని.. కానీ మన బ్యాటర్లు అతడ్ని గట్టిగా బిగించడం ఖాయమని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
పాత రోహిత్ జస్ట్ వచ్చి వెళ్లాడు..
14,505 బంతులతో ఎంసీఏ గిన్నిస్ రికార్డు
‘చాంపియన్స్ ట్రోఫీ’కి భారీ భద్రత
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి