IND vs AUS: ఆఖరి టెస్ట్.. టీమిండియాలో సంచలన మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:02 PM
Sydney Test: పుట్టెడు కష్టాల్లో ఉన్న భారత్ ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లు ఆడాల్సిన టైమ్ వచ్చేసింది. ఇక మీదట కూడా పాత ఆటే ఆడితే పుట్టి మునగక తప్పేలా లేదు.
BGT 2024: పుట్టెడు కష్టాల్లో ఉన్న భారత్ ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి ఇంకో లెక్క అన్నట్లు ఆడాల్సిన టైమ్ వచ్చేసింది. ఇక మీదట కూడా పాత ఆటే ఆడితే పుట్టి మునగక తప్పేలా లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలంటే టీమిండియా తమ బెస్ట్ ఇవ్వక తప్పదు. మళ్లీ గాడిన పడకపోతే కంగారూలు ట్రోఫీని చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అసలే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. రేపటి నుంచి మొదలయ్యే సిడ్నీ టెస్ట్‌ను డ్రా చేసుకున్నా సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. అయితే చాన్నాళ్లుగా తమకు ట్రోఫీని దూరం చేస్తున్నందుకు రోహిత్ సేన మీద ఆ జట్టు పగతో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాటు పగబట్టిన కమిన్స్ సేన బెండు తీసి బుద్ధి చెప్పడం టీమిండియా ముందున్న సవాల్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్ట్‌లో మెన్ ఇన్ బ్లూ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
రోహిత్ సహా వాళ్లు ఔట్!
ఐదో టెస్ట్‌లో టీమిండియాలో సంచలన మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో ఫ్లాప్ షో, టీమ్ వరుస ఫెయిల్యూర్స్ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మను ఈ మ్యాచ్‌లో ఆడించడం కష్టంగానే ఉంది. అతడికి రెస్ట్ ఇచ్చి యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ గిల్ టీమ్‌లోకి వస్తే అతడు ఫస్ట్ డౌన్‌లో ఆడతాడు. ఓపెనర్లుగా సీనియర్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ దిగుతారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెకండ్ డౌన్‌లో ఆడతాడు.
పేస్‌లో ఛేంజెస్!
రోహిత్‌తో పాటు జట్టులో మరో రెండు మార్పులు జరగడం పక్కాగా కనిపిస్తోంది. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను బెంచ్‌కు పరిమితం చేయాలని గంభీర్ ఆలోచిస్తున్నాడట. పంత్ ప్లేస్‌లో ధృవ్ జురెల్‌ను తీసుకోవాలని భావిస్తున్నాడట. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగుతారు. పేస్ ఆల్‌రౌండర్‌గా తెలుగు తేజం నితీష్ రెడ్డి ఆడతాడు. గాయపడిన ఆకాశ్‌దీప్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణలో ఒకర్ని ఆడించొచ్చు. మెయిన్ పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ దిగుతారు. భారీగా పరుగులు ఇస్తున్నందున సిరాజ్‌ను కాదని అతడి ప్లేస్‌లో మరో స్పీడ్‌స్టర్‌ను ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
భారత జట్టు (అంచనా):
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ/శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్/ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ/హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
Also Read:
మనూ భాకర్ సహా ముగ్గురికి ఖేల్‌రత్న
పంత్‌పై వేటు.. గిల్‌కు చోటు?
నితీష్...ఓ జీనియస్
బుమ్రాను నిరోధించేలా చట్టం
For More Sports And Telugu News