Rohit vs Gambhir: రోహిత్ నుంచి అతడికి కెప్టెన్సీ పగ్గాలు.. అంతా గంభీర్ అనుకున్నట్లే..
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:28 PM
Sydney Test: రోహిత్ శర్మ.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా టాప్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా గత కొన్నేళ్లలో భారత జట్టు నిర్మాణంలో అతడి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తున్న హిట్‌మ్యాన్ కెరీర్ చరమాంకానికి చేరుకుంది.
IND vs AUS: రోహిత్ శర్మ.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా టాప్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా గత కొన్నేళ్లలో భారత జట్టు నిర్మాణంలో అతడి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తున్న హిట్‌మ్యాన్ కెరీర్ చరమాంకానికి చేరుకుంది. టీ20 వరల్డ్ కప్-2024 తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. వన్డేలు, టెస్టుల్లో కంటిన్యూ అవుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కూ అతడు గుడ్‌బై చెప్పడం ఖాయంగా అనుకుంటున్నారు. అయితే వన్డేల కంటే ముందు టెస్టుల నుంచి రోహిత్ తప్పుకోవడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. అతడి నుంచి సారథ్య పగ్గాలను లాక్కోవడమే దీనికి బిగ్ ఎగ్జాంపుల్‌గా కనిపిస్తోంది. ఆఖరుకు రోహిత్‌ను ఏకాకిని చేసేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కెరీర్ గ్రాఫ్ డౌన్!
గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి రోహిత్ సరిగ్గా ఆడట్లేదు. అటు వన్డేలు, ఇటు టెస్టుల్లో దారుణంగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ముఖ్యంగా లాంగ్ ఫార్మాట్‌లో అతడి బ్యాట్ గర్జించడం లేదు. సెంచరీ మాట దేవుడెరుగు.. హాఫ్ సెంచరీ కొట్టడం కూడా గగనం అయిపోతోంది. సేమ్ టైమ్ శ్రీలంక చేతుల్లో వన్డే సిరీస్ ఓటమి, న్యూజిలాండ్ సిరీస్‌లో వైట్‌వాష్, ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో వరుస పరాజయాలు రోహిత్ కెరీర్ గ్రాఫ్‌ను కంప్లీట్‌గా కిందకు పడేశాయి. దీంతో కోచ్ గంభీర్, బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్ట్‌కు రోహిత్‌ను పక్కనబెట్టాలని ఫిక్స్ అయ్యారట. అతడి నుంచి కెప్టెన్సీ పగ్గాలను పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు అప్పగించే పనులు మొదలయ్యాయని సమాచారం.
పక్కా ప్లానింగ్!
రోహిత్ స్థానంలో మరో సీనియర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సారథ్య బాధ్యతలు అప్పగించాలని తొలుత అనుకున్నారట. అయితే కోహ్లీ కూడా ఫామ్ కోల్పోవడం, వయసు మీద పడటం, కెరీర్ ఎండింగ్‌లో ఉండటంతో ఆ ఆలోచనను మానుకున్నారట. కెప్టెన్సీ అనుభవం, పీక్ ఫామ్ ఉన్న బుమ్రాను హిట్‌మ్యాన్ వారసుడిగా సెలెక్ట్ చేశారట. రోహిత్ తన పోస్ట్, టీమ్‌లో ప్లేస్ పోగొట్టుకోవడానికి ఫామ్ కోల్పోవడం, సారథిగా విఫలమవడం, వ్యూహాల అమలులో ఫెయిల్యూర్, ప్లేయర్ల రొటేషన్ తప్పిదాలతో పాటు కోచ్ గంభీర్‌తో పడకపోవడం కూడా సాలిడ్ రీజన్ అని వినిపిస్తోంది. ఇద్దరికీ ఎప్పుడో చెడిందని.. అందుకే అతడ్ని పక్కా ప్లాన్ ప్రకారం గౌతీ సైడ్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే చివరి టెస్ట్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించే వరకు రోహిత్ భవిష్యత్ మీద ఓ క్లారిటీ రాదు. ఇది తెలిసిన నెటిజన్స్.. టీమ్ కోసం ఇంత చేసినోడ్ని ఇప్పుడు ఏకాకిని చేసేశారని కామెంట్స్ చేస్తున్నారు. హిట్‌మ్యాన్ సేవల్ని ఎవరూ మర్చిపోరని.. అతడో లెజెండ్ అని ప్రశంసిస్తున్నారు.