Share News

Suryakumar Yadav: టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య

ABN , Publish Date - Jan 29 , 2025 | 02:28 PM

IND vs ENG: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. గోల్డెన్ చాన్స్‌ను అతడు మిస్ చేసుకున్నాడు. దీంతో అతడు చేజేతులా చేసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Suryakumar Yadav: టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య
Suryakumar Yadav

Team India: టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్‌ను భారత క్రికెట్ బోర్డు నమ్మింది. హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి ఇతర ఆప్షన్లు ఉన్నా కాదని సూర్యకు అవకాశం ఇచ్చింది. కెప్టెన్‌గా జట్టును నడిపించమనే బాధ్యతను భుజాన పెట్టింది. అందుకు తగ్గట్లే మిస్టర్ 360 బోర్డు నమ్మకం వమ్ము చేయలేదు. సర్వశక్తులూ ఒడ్డుతూ టీమిండియాను విజయాల బాటలో నడిపిస్తున్నాడు. అప్పుడప్పుడు ఒకటీ, అరా ఓటములు ఎదురైనా పొట్టి ఫార్మాట్‌లో మన జోరుకు ఎదురులేదనే చెప్పాలి. ఇంత చేస్తున్నా సూర్య సారథ్యం చిక్కుల్లో పడింది. దీనికి అసలు కారణం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


అదే సమస్య!

టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్‌తో రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో అతడి స్థానంలో నూతన సారథిగా సూర్యకుమార్‌ను నియమించింది బీసీసీఐ. బుమ్రా, హార్దిక్‌ రూపంలో గట్టి పోటీ ఉన్నా.. అతడికే మొగ్గు చూపారు బోర్డు పెద్దలు. అందుకు తగ్గట్లే అతడు కూడా సక్సెస్‌ఫుల్‌గా టీమ్‌ను నడిపిస్తున్నాడు. కానీ గత కొన్ని సిరీస్‌లుగా సూర్య టచ్ కోల్పోయాడు. బ్యాటింగ్‌లో అతడి పరాభవాల పరంపర కొనసాగుతోంది. ఒక్కోసారి మంచి స్టార్ట్స్ అందుకున్నా వాటిని బిగ్ స్కోర్స్‌గా మలచలేకపోతున్నాడు.


గర్జించని బ్యాట్!

0, 12, 14.. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో సూర్య స్కోర్లు ఇవి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత బ్యాటింగ్‌ సమస్యలు ఎదుర్కొంటోంది. కెప్టెన్‌ కాబట్టి అదనపు బాధ్యత తీసుకొని ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన సూర్య.. వచ్చీ రాగానే పెవిలియన్ బాట పడుతున్నాడు. అతడి బ్యాటింగ్ ఫెయిల్యూర్‌పై బోర్డు పెద్దలు గరంగరంగా ఉన్నట్లు సమాచారం. టీ20 కెప్టెన్సీ ఎంపిక సమయంలో సూర్యను తాత్కాలిక సారథిగానే నియమించింది బీసీసీఐ. వచ్చే టీ20 వరల్డ్ కప్‌ వరకు అతడు ఆ పోస్ట్‌లో ఉంటాడని తెలిపింది. కానీ ఒకవేళ అతడు విఫలమైతే తిరిగి కొత్త సారథిని నియమించే అవకాశాల్ని కొట్టిపారేయలేం. కాబట్టి సూర్య చేజేతులా బోర్డుకు అవకాశం ఇస్తున్నాడని.. అతడి బ్యాటింగ్ గాడిన పడకపోతే మరొకరు కెప్టెన్ అవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గెలిస్తే ఓకే గానీ ఓడితే సూర్య బ్యాటింగ్ ఫెయిల్యూర్‌ను భూతద్దంలో చూపుతూ మరిన్ని విమర్శలు వస్తాయని.. అది క్రమంగా సారథ్య మార్పుకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.


ఇవీ చదవండి:

ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

టీమిండియాకు ఎలా ఆడాలి.. బాలుడి ప్రశ్నకు విరాట్ సమాధానం

సురేఖను ఖేల్‌రత్నకు పరిగణించండి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 02:33 PM