Tilak Varma Unbeaten 72: మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్.. వర్తు వర్మ వర్తు
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:22 PM
India vs England: టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సెన్సేషనల్ బ్యాటింగ్‌తో హోరెత్తించాడు. పోయిందనుకున్న మ్యాచ్‌ను స్టన్నింగ్ నాక్‌తో భారత్ వైపు తిప్పాడు. అందరూ చేతులెత్తేసిన చోట.. ధైర్యంగా నిలబడి ఇంగ్లండ్‌తో తలపడి టీమ్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు.

ప్రతి స్టార్ బ్యాట్స్‌మన్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు ఉంటాయి. సూపర్బ్ నాక్స్ ఆడి టీమ్‌ను గెలిపించిన సందర్భాలు చాలానే ఉంటాయి. అభిమానుల నుంచి ప్రశంసలు, విమర్శల నుంచి మెచ్చుకోళ్లు అందుకోవడం కూడా కామనే. అయితే ఎన్ని మ్యాచులు ఉన్నా.. జీవితాంతం గుర్తుండిపోయే నాక్స్ మాత్రం కొన్నే ఉంటాయి. వాటిని వేళ్ల మీద లెక్కబెట్టుకోవచ్చు. అలాంటి ఓ మెమరబుల్ నాక్ ఆడేశాడు హైదరాబాదీ తిలక్ వర్మ. చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో అతడు మ్యాజికల్ ఇన్నింగ్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసేశాడు.
ఎప్పటికీ మర్చిపోలేడు!
చెపాక్ టీ20లో 55 బంతుల్లో 4 బౌండరీలు, 5 భారీ సిక్సులతో 72 పరుగుల విన్నింగ్ నాక్ ఆడాడు తిలక్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా స్టార్ బ్యాటర్లంతా రెండంకెల స్కోరు చేయడానికి ఆపసోపాలు పడిన పిచ్ మీద మ్యాచ్‌ను ఫినిష్ చేసే దాకా క్రీజును వీడలేదు తిలక్. మూడో ఓవర్‌లో వచ్చినోడు ఆఖరి పరుగు పూర్తయ్యే వరకే అక్కడే స్తంభంలా పాతుకుపోయాడు. జోఫ్రా ఆర్చర్ సహా అందరు ఇంగ్లీష్ బౌలర్లను ఉతికిపారేశాడు. ఈ నాక్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న తిలక్.. పలు అరుదైన ఘనతలు కూడా అందుకున్నాడు. అదే సమయంలో ఈ నాక్‌తో ఓ స్పెషల్ మెమరీని క్రియేట్ చేశాడు. 72 అనే నంబర్ తిలక్‌కు ఎంతో స్పెషల్.
సేమ్ టు సేమ్!
తిలక్ జెర్సీ నంబర్ 72. టీమిండియా తరఫున ఇదే జెర్సీతో ఆడుతున్నాడీ లెఫ్టాండ్ బ్యాటర్. నిన్నటి మ్యాచ్‌లో అతడు చేసిన పరుగులు 72. భారత టీ20 క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌గా అందరూ కొనియాడుతున్న ఈ నాక్‌లో అతడు చేసిన పరుగులు, ధరించే జెర్సీ నంబర్ 72 కావడంతో ఇది తనకు చాలా స్పెషల్ అంటున్నాడు తిలక్. జెర్సీ నంబర్, స్కోర్ సేమ్ అని తాను అబ్జర్వ్ చేయలేదన్నాడు. అతడే కాదు.. మ్యాచ్‌లో కూడా ఎవరూ దీనిని గమనించలేదు. అయితే తర్వాత తెలియడంతో వర్తు వర్మ వర్తు అని కామెంట్స్ చేస్తున్నారు. అన్ని విధాలుగా హైదరాబాద్ బ్యాటర్‌కు ఇది గుర్తుండిపోయే మ్యాచ్, స్పెషల్ నాక్ అని చెబుతున్నారు.
ఇదీ చదవండి:
టీమిండియాకు కొత్త కోహ్లీ.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది
రోహిత్-కోహ్లీ వల్లే కాలేదు.. తిలక్ వర్మ సాధించి చూపించాడు
తిలక్‌ను పొగుడుతున్నారు.. గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి