Share News

కర్రాన్‌ సెంచరీ.. జింబాబ్వేదే సిరీస్‌

ABN , Publish Date - Feb 19 , 2025 | 03:30 AM

ఐర్లాండ్‌తో ఆఖరి వన్డేలో జింబాబ్వే సత్తా చాటింది. మంగళవారం ఇక్కడ జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య జింబాబ్వే 2-1తో...

కర్రాన్‌ సెంచరీ.. జింబాబ్వేదే సిరీస్‌

హరారే: ఐర్లాండ్‌తో ఆఖరి వన్డేలో జింబాబ్వే సత్తా చాటింది. మంగళవారం ఇక్కడ జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య జింబాబ్వే 2-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఓపెనర్‌ బల్‌బిర్నీ (64), లోర్కాన్‌ టక్కర్‌ (61), హ్యారీ టెక్టర్‌ (51) అర్ధ శతకాలతో రాణించారు. రిచర్డ్‌, ట్రెవర్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఓపెనర్‌ బెన్‌ కర్రాన్‌ (118 నాటౌట్‌) అజేయ శతకంతో విజృంభించడంతో జింబాబ్వే 39.3 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ క్రెగ్‌ ఎర్విన్‌ (69 నాటౌట్‌) అజేయ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. బెన్‌ కర్రాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, బ్రియాన్‌ బెనెట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి.


ఇవి కూడా చదవండి:

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..



Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 19 , 2025 | 03:30 AM