‘హజారే’ టైటిల్‌పోరుకు విదర్భ
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:16 AM
విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ జట్టు ఫైనల్ చేరింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్లో విదర్భ 69 పరుగుల తేడాతో మహారాష్ట్రను ఓడించింది....

వడోదర: విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ జట్టు ఫైనల్ చేరింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్లో విదర్భ 69 పరుగుల తేడాతో మహారాష్ట్రను ఓడించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో కర్ణాటకతో విదర్భ తలపడనుంది. ఇక, మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ.. ఓపెనర్లు ధ్రువ్ షోరే (114), యష్ రాథోడ్ (116) సూపర్ సెంచరీలకు తోడు టాపార్డర్ బ్యాటర్లు కరుణ్ నాయర్ (88 నాటౌట్), జితేష్ శర్మ (51) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటడంతో 50 ఓవర్లలో 3 వికెట్లకు 380 పరుగుల భారీస్కోరు చేసింది. ఛేదనలో మహారాష్ట్ర.. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (90), మిడిలార్డర్‌లో అంకిత్ బావ్నే (50) అర్ధసెంచరీలతో పోరాడినా 50 ఓవర్లలో 311/7 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. విదర్భ బౌలర్లలో దర్శన్, నచికేత్ చెరో మూడు వికెట్లు తీశారు.