Share News

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

ABN , Publish Date - Feb 02 , 2025 | 12:37 PM

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహించారు. రియల్ ఎస్టేట్ రంగంపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని కాంగ్రెస్ దెబ్బకు వారు విలవిల్లాడుతున్నారని ఆరోపించారు.

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
BRS working president KTR

హైదరాబాద్: ఏడాది పాలనలోనే ఆకలిచావులు, ఆత్మహత్యల రాష్ట్రంగా తెలంగాణను కాంగ్రెస్ మార్చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS working president KTR) ఆరోపించారు. పదేళ్ల పాలనతో తెలంగాణ (Telangana)ను దేశానికే అన్నపూర్ణగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నిలబెడితే దాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఏడాదిలోనే అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణ మార్చేశారని ఎక్స్ వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు.


హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని కేటీఆర్ ఆగ్రహించారు. రియల్ ఎస్టేట్ రంగంపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని కాంగ్రెస్ దెబ్బకు వారు విలవిల్లాడుతున్నారని ఆరోపించారు. పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, తెచ్చిన అప్పులు చెల్లించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల ఉసురు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి రైతుల్లో కేసీఆర్ ఆత్మవిశ్వాసం నింపారని, వ్యవసాయ రంగానికి ఆయన వెన్నెముకగా నిలిచారని కీర్తించారు.


సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సాగునీళ్లు అందక, కరెంట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆరుగాలం పండించిన పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, రైతుభరోసా, రుణమాఫీ అందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రజలను వేధించే పాలనంటూ చురకలు అంటించారు. జాగో తెలంగాణ జాగో అంటూ రైతులు, ఆటో డ్రైవర్ ఆత్మహత్మలు చేసుకున్న వార్తా పత్రికల క్లిప్పింగులను ట్వీట్‌కు జోడిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ambulance Tragedy: రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం

Fire Accidents: పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..

Updated Date - Feb 02 , 2025 | 12:38 PM