CM Revanth Reddy: భూమి లేకపోయిన రైతు భరోసా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
ABN , Publish Date - Jan 04 , 2025 | 09:13 PM
CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఎకరానికి ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
హైదరాబాద్: రైతు భరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఎకరానికి ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భూమి లేకున్న రైతు భరోసా ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. భూమిలేని కుటుంబాలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట భూమిలేని కుటుంబాలకు సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంత్రి నుంచి కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు రైతు భరోసా పెంచి ఇస్తున్నట్లు తెలిపారు. జనవరి 26 నుంచి కొత్త పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వమని తేల్చిచెప్పారు. గుట్టలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.