Dawat Biryani Hotel: బిర్యానీ తెచ్చిన తంటా.. కస్టమర్లను కొట్టిన హోటల్ నిర్వాహకులు
ABN , Publish Date - Feb 14 , 2025 | 09:16 AM
Dawat Biryani Hotel: బిర్యానీ తినడానికి వచ్చిన కస్టమర్లతో హోటల్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన మీర్‌పేట్‌లో చోటు చేసుకుంది. హోటల్ నిర్వాహకులకు, కస్టమర్లకు ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హైదరాబాద్: హోటల్ అంటే కస్టమర్లను సాదరంగా ఆహ్వానించాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన ఆహారాన్ని అందజేయాలి. దాదాపు అన్ని హోటల్లలో ఇదే విధానం అమల్లో ఉంటుంది. కస్టమర్లను మచ్చిక చేసుకోవడానికి హోటల్ సిబ్బంది, యాజమాన్యాలు అన్ని చర్యలు తీసుకుంటాయి. కానీ.. మీర్‌పేట్‌లో మాత్రం కస్టమర్లను(Customers) అవమానించడమే(Insults) హస్తీనాపురం దావత్ బిర్యానీ హోటల్ నిర్వాహకులు పనిగా పెట్టుకున్నారు. అక్కడి సిబ్బంది కస్టమర్లతో కనీస మర్యాద లేనట్లుగా ప్రవర్తించారు. బిర్యానీ కోసం వచ్చిన కస్టమర్లను విచక్షణ రహితంగా కొట్టారు. ఈఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆర్డర్ చేసిన తర్వాత ఘర్షణ..
మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తీనాపురంలో దావత్ బిర్యానీ హోటల్ నిర్వాహకులు వీరంగం సృష్టించారు. హోటల్‌కు వచ్చిన కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి చేశారు. దగ్గరుండి హోటల్ మేనేజర్ దాడి చేయించాడు. మీర్‌పేట్‌లోని ఓ హోటల్‌లో బిర్యానీ తిందామని కొంతమంది వ్యక్తులు వెళ్లారు. డైనింగ్ టేబుల్‌పై కూర్చొని ఆర్డర్ చేశారు. అయితే ఆర్డర్ వచ్చిన తర్వాత ఓ విషయంలో కస్టమర్లు హోటల్ యజమానికి తెలిపారు. అయితే కస్టమర్లపై హోటల్ యజమాని, సిబ్బంది రెచ్చిపోయి దారుణంగా కొట్టారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
ఈ విషయం కాసేపటికే ఆ ఏరియా మొత్తం తెలిసిపోయింది. రక్తాలు వచ్చేలా కస్టమర్లను హోటల్ సిబ్బంది కొట్టినట్లు తెలుస్తోంది. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గొడవను సద్దుమణిపించే ప్రయత్నం చేశారు. కస్టమర్లకు తీవ్ర గాయాలవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిర్యానీ తినడానికి వస్తే కొడతారా అని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకొని మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌లో జరిగిన దాడి సీసీటీవీలో రికార్డ్ అయింది. హోటల్ సిబ్బందిని కఠినంగా శిక్షించాలని కస్టమర్లు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!
సంజయ్, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు
ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి
Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర
Read Latest Telangana News and National News