Formula E Case: కేటీఆర్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. మరోసారి నోటీసులు
ABN , Publish Date - Jan 07 , 2025 | 02:51 PM
Telangana:కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా మాజీ మంత్రికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌యుకు కట్టబెట్టిన రూ.55 కోట్ల వ్యవహారంపై ఈడీ విచారణ చేయనుంది. ఫెమా నిబంధనలు ఉల్లగించినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, జనవరి 7: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు (Former minister KTR) షాక్‌ల మీద షాక్‌లు తగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు (Telangana High Court) కొట్టివేయగా.. తాజాగా ఈడీ నోటీసులతో కేటీఆర్‌కు ఉచ్చు బిగుస్తున్నట్లైంది. కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా మాజీ మంత్రికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌ఈవోకు కట్టబెట్టిన రూ.55 కోట్ల వ్యవహారంపై ఈడీ విచారణ చేయనుంది. ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంపై కేటీఆర్‌ను ప్రశ్నించనుంది ఈడీ. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకొని ఈసీఐఆర్‌ను ఈడీ నమోదు చేసింది. కాగా.. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి వారం క్రితమే కేటీఆర్‌కు మొదటి సారి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈరోజు (జనవరి 7) విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌కు సంబంధించి తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ కోరారు. అయితే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
మరోవైపు ఈ కేసులో ఏసీబీ కూడా కేటీఆర్‌కు రెండు సార్లు నోటీసులు ఇచ్చింది. ఈనెల 6న రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వగా.. విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు మాజీ మంత్రి. అయితే న్యాయవాదితో విచారణకు రావడంతో పోలీసులు లోపలికి అనుమతించలేదు. లాయర్ ఉంటేనే విచారణకు వస్తానని కేటీఆర్ కూడా పట్టుబట్టారు. చివరకు ఏసీబీకి లిఖితపూర్వకంగా లేఖ రాసిన కేటీఆర్.. విచారణకు హాజరుకాకుండాను వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 9న విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈడీ, ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందన ఎలా ఉండబోతుంది.. విచారణకు హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసిన నేపథ్యంలో ఏక్షణమైనా కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇవి కూడా చదవండి...
Allu Arjun: ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే..
KTR: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్.. కేటీఆర్ విసుర్లు
Read Latest Telangana News And Telugu News