Share News

Shekhar Basha: లావణ్యపై శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:25 PM

Shekhar Basha: లావణ్యపై ఆర్జే శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్తాన్ సాయితో ఫోన్ సంభాషణపై స్పందిస్తూ.. ఆయన కేవలం సమాచారం కోసం మాట్లాడినట్లు స్పష్టం చేశారు. లావణ్య ఒక దొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు శేఖర్ బాషా.

Shekhar Basha: లావణ్యపై శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు
RJ Shekhar Basha

హైదరాబాద్, ఫిబ్రవరి 7: నగ్న వీడియోల కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో మస్తాన్ సాయితో పాటు ఆర్జే శేఖర్ బాషాపై (RJ Shekhar Basha) కూడా కేసు నమోదు అయ్యింది. లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే శేఖర్ బాషా కూడా మస్తాన్ సాయితో ఫోన్‌లో మాట్లాడారంటూ ఆర్జేకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో శేఖర్ బాషా మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకెళ్లి లావణ్య ఇంట్లో పెట్టమని ఎక్కడా చెప్పలేదని.. మస్తాన్ సాయి కాల్ చేసిన సమయంలో డ్రగ్స్ వాడుతున్నట్లైతే కచ్చితంగా పట్టించాలని ఉద్దేశంతోనే కాల్ మాట్లాడినట్లు.. తనకు ఈ అంశంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.


లావణ్య ఎన్నోసార్లు అనేక చోట్ల పట్టుబడ్డారని తెలిపారు. తనను ఇరికించారని చెబుతున్న లావణ్య డ్రగ్ టెస్టు ఎందుకు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. డ్రగ్ కేసులో 40 రోజుల పాటు జైల్లో ఉన్న లావణ్య అమాయకురాలా అని ప్రశ్నించారు. లావణ్య డ్రగ్ తీసుకుంటుంది అనే విషయాన్ని మస్తాన్ సాయి చెప్పాడని తెలిపారు. లావణ్య గురించి సమాచారం ఇస్తామని మస్తాన్ సాయి చెబితేనే అతడితో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు.

జగన్‌కు సాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్


అలాగే లక్ష్మీ పడాల గురించి మాట్లాడుతూ.. తనను చంపడానికి ఆమె కుట్ర చేసిందన్నారు. లావణ్యతో ఉంటూ ఆమె తమ్ముడితో స్నేహం చేస్తూ తనను చంపాలని ఎన్నో ప్లాన్‌లు వేశారని చెప్పుకొచ్చారు. లక్ష్మీ పడాల దాదాపు ఏడుగురిపై రేప్ కేసులు పెట్టారని.. అందులో ఎస్పీ కూడా ఉన్నారన్నారు. కోర్టు నుంచి తప్పించుకుని తిరుగుతున్న క్రిమినల్ లక్ష్మీ పడాల అంటూ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ పెడ్లర్‌తో చేరి తనను చంపడానికి స్కెచ్ వేసిందని వ్యాఖ్యలు చేశారు. ప్రతీ నిర్దోషికి తాను ఆయుధమవుతానని అన్నారు. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశారనే దానిపై విచారణకు జరుగుతున్న సమయంలో ప్రైవేటు ఆడియోలను శేఖర్ బాషా సోషల్ మీడియాలో వైరల్ చేశారని.. తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ షష్టి వర్మ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. బహిరంగంగానే చర్చ జరుగుతోందని.. తన వద్ద సమాచారాన్ని మాత్రమే షేర్ చేశానని.. ఇందులో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని శేఖర్ బాషా చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి...

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం

జగన్‌కు సాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 07 , 2025 | 12:42 PM