Share News

Masthan Sai: మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ABN , Publish Date - Feb 22 , 2025 | 12:55 PM

Masthan Sai: మస్తాన్ సాయి కన్ఫెషన్‌ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Masthan Sai: మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Masthan Sai Case

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నగ్న వీడియోలు, డ్రగ్స్‌ పార్టీల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి (Masthan Sai Case) కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మస్తాన్ సాయిని మూడు రోజలు పాటు పోలీసులు విచారించారు. హార్డ్ డిస్క్, డ్రగ్స్, పార్టీస్, సాఫ్ట్ వేర్ అన్నింటి గురించి పోలీసులు ప్రశ్నించారు. అయితే డ్రగ్స్‌పై మాత్రం మస్తాన్ సాయి నోరు మెదపనట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు అనే ప్రశ్నలకు మస్తాన్ సాయి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అయితే హార్డ్ డిస్క్‌ల గురించి పోలీసులకు వివరణ ఇచ్చాడు మస్తాన్.


హార్డ్ డిస్క్‌లో మొత్తం 17 ఫోల్డర్లు ఉండగా... 17 ఫోల్డర్లను మస్తాన్ సాయి ముందు పోలీసులు తెరిచారు. హార్డ్ డిస్క్ మొత్తంలో ఆరుగురు అమ్మాయిలకు సంబంధించిన వీడియోలను కాప్స్‌ గుర్తించారు. వీటిలో ఎక్కువగా వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్స్ బయటపడ్డాయి. లావణ్యతో పాటు మస్తాన్ గర్ల్ ఫ్రెండ్స్, తన భార్యకు సంబంధించిన వీడియోలను పోలీసులు గుర్తించారు. అలాగే కొన్ని నార్మల్ వీడియోస్, మరికొన్ని ప్రైవేట్ వీడియోస్ బయటపడ్డాయి.

Amarnath Reddy: నేను ఏ విచారణకు రాను.. భూకబ్జాలపై వైసీపీ ఎమ్మెల్యే


2500కు పైగా ఫోటోలు, 505కు పైగా వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్‌ను పోలీసులు గుర్తించారు. ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరికీ సంబంధించిన ప్రైవేట్ వీడియోలు వాళ్ళకి తెలీకుండా రికార్డు చేసినట్టు మస్తాన్ సాయి ఒప్పుకున్నాడు. లావణ్య ఫోన్ నుంచి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్‌ను క్విక్ షేర్ ద్వారా వచ్చినట్టు గుర్తించారు. పోడ్ కాస్ట్ ఫోల్డర్‌లో ఫోన్ హ్యాక్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు గుర్తించారు.


ఇవి కూడా చదవండి..

Hyderabad Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్.. బకాయిలు ఎంత పేరుకుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు..

Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 22 , 2025 | 01:12 PM

News Hub