ప్రతీ పేద కుటుంబానికి సన్నబియ్యం
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:11 AM
పేద వారి కడుపునింపడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. ఆదివారం రామగుండం నగరపాలక సంస్థ 43వ డివిజన్ పరిధిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం పం పిణీ చేశారు.

కోల్‌సిటీ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పేద వారి కడుపునింపడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. ఆదివారం రామగుండం నగరపాలక సంస్థ 43వ డివిజన్ పరిధిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం పం పిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్‌ఎస్ ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, తాము ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడంతోపాటు కొత్త రేషన్‌కార్డులు ఇస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 3కోట్ల పది లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రామగుండంలో ప్రస్తుతం ఇస్తున్న 89వేల క్వింటాళ్ల సన్నబియ్యంతో పాటు మరో పదివేల కొత్త రేషన్‌కార్డులకు కూడా బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. తహసీల్దార్ కుమారస్వామి, రేషన్ డీలర్ నంబయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్, నాయకులు మహంకాళి స్వామి, మారెల్లి రాజిరెడ్డి, గట్ల రమేష్, పెద్దెల్లి ప్రకాష్, పాల్గొన్నారు.