Share News

Yennam Srinivas: అదే నా లక్ష్యం.. సహకరించండి

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:51 PM

Telangana: ‘‘మన జిల్లా విద్యాపరంగా.. ఉపాధి పరంగా ఎంతో వెనకబడింది.. పేరుకు లిటరసీ పెరిగినా.. ఉపాధి పరంగా వెనకబడింది’’ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ అన్నారు. గతంలోనే డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రతీ రెండు వార్డులకు ఓ లర్నింగ్ సెంటర్ పెడతామన్నారు. అక్కడే ఉన్నత చదువులు చదివిన వారితో కోచింగ్ ఇప్పిస్తామన్నారు.

Yennam Srinivas: అదే నా లక్ష్యం.. సహకరించండి
Yennam Srinivas Reddy

మహబూబ్ నగర్, జనవరి 2: విద్యారంగంలో మహబూబ్ నగర్ రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నో చేశామని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Congress MLA Yennam Srinivas Reddy) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ విద్యా నిధిని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ పేరున బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు అనేక విషయాల్లో రాణించేందుకు తక్షణమే ఆర్థిక సాయం కోసం ఇది పని చేస్తుందన్నారు. దీనికి ఎవరైనా సాయం చేయవచ్చని.. నేరుగా అకౌంట్‌కు డబ్బులు వేయవచ్చాన్నారు. ‘‘మన జిల్లా విద్యాపరంగా.. ఉపాధి పరంగా ఎంతో వెనకబడింది.. పేరుకు లిటరసీ పెరిగినా.. ఉపాధి పరంగా వెనకబడింది’’ అని అన్నారు. గతంలోనే డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రతీ రెండు వార్డులకు ఓ లర్నింగ్ సెంటర్ పెడతామన్నారు. అక్కడే ఉన్నత చదువులు చదివిన వారితో కోచింగ్ ఇప్పిస్తామన్నారు.


‘‘నా వేతనం నుంచి ప్రతీ నెలా లక్ష రూపాయలు విద్యానిధికి డొనేట్ చేస్తా.. ఇలా నేను యాభై లక్షలు సమకూరుస్తా. నాకు శాల్స్ బదులుగా.. విద్యానిధికి డొనేట్ చేయండి. నా లక్ష్యం ప్రతీ ఏడూ రెండు కోట్ల రూపాయల నిధిని సమకూర్చాలని’’ అని వెల్లడించారు. తద్వారా విద్యకు సంబంధించిన ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం ఈ నిధిని ఖర్చు చేస్తామన్నారు. వేల మంది విద్యార్థులకు ఓ దారి చూపాలన్నదే లక్ష్యమన్నారు. ఇక్కడి మేధావులను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయాలని కూడా ఈ ప్రక్రియ తీసుకున్నామన్నారు. ‘‘రేపు నా పుట్టిన రోజున ఎలాంటి ఫ్లెక్సీ కట్టొద్దు.. దానికి అయ్యే ఖర్చు విద్యానిధికి విరాళంగా ఇవ్వండి’’ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నేతలు, కార్యకర్తలు, అభిమానులను కోరారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ క్యాబినెట్ భేటీ.. నిర్ణయాలు ఇవే..

నేటి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే

Read Latest Telangana News And Telugu news

Updated Date - Jan 02 , 2025 | 04:56 PM