Share News

Ratan Tata: రూ.4,030 కోట్లతో రతన్‌టాటా రోడ్డు

ABN , Publish Date - Feb 26 , 2025 | 09:38 AM

ఓఆర్‌ఆర్‌లోని రావిర్యాల(టాటా ఇంటర్‌చేంజ్‌) నుంచి ఫ్యూచర్‌ సిటీ మీదుగా ఆమన్‌గల్‌ వద్ద ప్రతిపాదిత ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రహదారికి రాష్ట్ర ప్రభుత్వం రతన్‌టాటా రోడ్డు(Ratan Tata Road)గా పేరు పెట్టింది.

Ratan Tata: రూ.4,030 కోట్లతో రతన్‌టాటా రోడ్డు

- 41.50 కిమీల గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రహదారి

- 28వ తేదీ నుంచి టెండర్లు

హైదరాబాద్‌ సిటీ: ఓఆర్‌ఆర్‌లోని రావిర్యాల(టాటా ఇంటర్‌చేంజ్‌) నుంచి ఫ్యూచర్‌ సిటీ మీదుగా ఆమన్‌గల్‌ వద్ద ప్రతిపాదిత ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రహదారికి రాష్ట్ర ప్రభుత్వం రతన్‌టాటా రోడ్డు(Ratan Tata Road)గా పేరు పెట్టింది. ఈ రోడ్డును రూ.4,030 కోట్లతో నిర్మించనున్నారు. 41.50 కి.మీ.ల పొడవు ఉండే ఈ రతన్‌ టాటా రహదారి నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో సకల సదుపాయాలు కల్పిస్తాం..


మొదటి దశలో రూ.1,665 కోట్లతో ఓఆర్‌ఆర్‌ రావిర్యాల(టాటా ఇంటర్‌చేంజ్‌) నుంచి మీర్‌ఖాన్‌పేట(Meerkhanpet) వరకు 19.2 కి.మీ దూరం రోడ్డు నిర్మాణం చేపడతారు. రెండోదశలో రూ.2,365 కోట్లతో మీర్‌ఖాన్‌పేట(ప్యూచర్‌సిటీ) నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ (ఆమన్‌గల్‌) వరకు 22.30 కి.మీ దూరం రహదారి నిర్మాణం చేయనున్నారు.

city7.2.jpg


ఈ రహదారి నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏ(HMDA)కు, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌) సంస్థలకు అప్పగించింది. ఈ నేపథ్యంలో రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లను ఫిబ్రవరి 28 నుంచి స్వీకరిస్తామని హెచ్‌ఎండీఏ మంగళవారం ప్రకటించింది. టెండర్‌ వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. సాంకేతిక బిడ్లను మార్చి 21న తెరుస్తామని హెచ్‌ఎండీఏ వెల్లడించింది.


ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్‌?

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2025 | 09:38 AM