Share News

ఆస్తుల సృష్టికి.. అప్పుల వినియోగమెంత?

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:09 AM

తెచ్చిన అప్పులను ఆస్తుల సృష్టికి వినియోగించకపోవడం ఏటా చర్చనీయంగా మారుతోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పు తెచ్చిన మొత్తంతో మూలధన వ్యయం కింద ఆస్తులను సృష్టిస్తుంది.

ఆస్తుల సృష్టికి.. అప్పుల వినియోగమెంత?

  • తెచ్చిన అప్పులను పూర్తిగా ఖర్చు పెట్టని సర్కారు.. మూలధన అంచనా వ్యయంలో తగ్గుదల

  • పరిమితికి మించి అప్పు తెచ్చిన రాష్ట్రం: కాగ్‌

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): తెచ్చిన అప్పులను ఆస్తుల సృష్టికి వినియోగించకపోవడం ఏటా చర్చనీయంగా మారుతోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పు తెచ్చిన మొత్తంతో మూలధన వ్యయం కింద ఆస్తులను సృష్టిస్తుంది. కానీ.. రాష్ట్రంలో 2019 నుంచి ఏనాడూ అప్పుల సొమ్మును ఆస్తుల సృష్టికి పూర్తిస్థాయిలో వినియోగించలేదని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) గుర్తించింది. రాబడులు, వ్యయాల మధ్య అంతరం ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల బాట పట్టడం సాధారణమే..! ఈ అప్పులను ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు, భవనాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలి. వీటి వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వానికి కూడా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కొంత మేర రాబడి సమకూరే అవకాశాలుంటాయి. అందుకే.. అప్పులను తప్పకుండా మౌలిక సదుపాయాల కల్పనకే వినియోగించాలంటూ కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ఆయా రాష్ట్రాలను ఆదేశిస్తుంటాయి. తెలంగాణలో మాత్రం అప్పులను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. ఇదివరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాము అప్పులు చేసినా.. పెద్ద మొత్తంలో ఆస్తులను సృష్టించామని చెప్పేది. సాగునీటి ప్రాజెక్టులు, సచివాలయం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ వంటి భవనాలను నిర్మించామని ఆ పార్టీ నేతలు చెప్పేవారు. వాస్తవ వ్యయాలను చూస్తే మాత్రం.. తెచ్చిన అప్పులను పూర్తిస్థాయిలో మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టినట్లు కనిపించడం లేదని కాగ్‌ ఆక్షేపించింది.


ఆశించిన మేర రాని రాబడులు

రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన మేర రాబడులు సమకూరడం లేదని కాగ్‌ వెల్లడించింది. భారీ మొత్తంలో అంచనాలను రూపొందిస్తున్నప్పటికీ.. సంవత్సరాంతానికి ఆదాయాలు లక్ష్యం మేర రావడం లేదని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు 78ు మేర సమకూరాయని వివరించింది. రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,567 కోట్లుగా ఉంటే.. రూ.1,69,293 కోట్లు(78ు) సమకూరాయి. రెవెన్యూ వ్యయం కింద రూ.2,11,685 కోట్లను ఖర్చు చేస్తామని ప్రభుత్వం అంచనా వేయగా.. ఆ సంవత్సరం రూ.1,68,514 కోట్ల(90ు)ను మాత్రమే వ్యయం చేయగలిగింది. ఇది కేవలం ఆ ఒక్క సంవత్సరంలోనే కాదు.. అంతకుముందు కూడా అంచనాల కంటే తక్కువగా ప్రభుత్వం వ్యయం చేసిందని కాగ్‌ వెల్లడించింది. అప్పుల కిస్తీలు, వడ్డీ చెల్లింపులకే ప్రభుత్వం 15.90ు మేర నిధులను వెచ్చించిందని కాగ్‌ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.49,977 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడడం వల్ల.. దాన్ని పూడ్చుకోవడానికి రూ.40,957 కోట్ల అప్పు తీసుకున్నట్లు గుర్తుచేసింది. ఆగంతుక నిధి నుంచి రూ.కోటి, ప్రభుత్వ ఖాతా నుంచి రూ.8,984 కోట్లను సేకరించిందని వివరించింది. మొత్తం రెవెన్యూ రాబడులు రూ.1,69,293 కోట్లలో 41ు నిధులను వేతనాలు, భత్యాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చుచేయాల్సి వచ్చిందని తెలిపింది. జీతభత్యాలకు రూ.27,981 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.24,347 కోట్లు, పెన్షన్లకు రూ.16,835 కోట్లు చెల్లించిందని వివరించింది. వడ్డీ చెల్లింపులు(రూ.24,347 కోట్లు-10.5ు), అప్పుల కిస్తీల చెల్లింపులు(రూ.12,519 కోట్లు- 5.4ు) మేర.. మొత్తం 15.9ు ఉన్నాయని ఆక్షేపించింది.


జీఎ్‌సడీపీలో పరిమితికి మించి అప్పులు..

2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎ్‌సడీపీ) పరిమితికి మించి అప్పు చేసిందని కాగ్‌ ఆరోపించింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎ్‌సడీపీలో రాష్ట్ర అప్పుల మొత్తం 33.10 శాతానికి మించకూడదు. కానీ.. ఆ సంవత్సరం అప్పుల మొత్తం జీఎ్‌సడీపీలో 34.47శాతాని(రూ.5,17,659 కోట్ల అప్పు)కి చేరాయని కాగ్‌ తప్పుబట్టింది. జీఎ్‌సడీపీలో ఆర్థిక లోటు(ఫిస్కల్‌ డెఫిసిట్‌) కూడా 3 శాతానికి మించకూడదు. కానీ.. రూ.49,977 కోట్ల లోటుతో 3.33 శాతానికి చేరడాన్ని కాగ్‌ ఆక్షేపించింది.


స్థానిక సంస్థలకు రూ.13,690 కోట్ల గ్రాంట్లు: కాగ్‌

రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌, పట్టణ స్థానిక సంస్థలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.13,690 కోట్ల గ్రాంట్లను మంజూరు చేసిందని కాగ్‌ వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు, ఎన్‌జీవోలు, ఇరత సంస్థలన్నింటికీ చెల్లించిన మొత్తం గ్రాంట్ల(రూ.76,773 కోట్లు)లో పంచాయతీరాజ్‌, పట్టణ స్థానిక సంస్థలకు చెల్లించిందే 18 శాతమని వివరించింది.


అప్పు-మూలధన వ్యయం తీరు (రూ.కోట్లలో)

సంవత్సరం అప్పు మూలధన

వ్యయం

201920 38,285 25,559

202021 47,132 26,790

202122 46,995 28,883

202223 41,560 17,881

202324 50,528 43,918

అంచనాలు.. వాస్తవ వ్యయాలు (రూ.కోట్లలో)

సంవత్సరం అంచనా వాస్తవ గ్యాప్‌

వ్యయం వ్యయం

201920 1,11056 1,08,797 2,259

202021 1,38,670 1,23,212 15,458

202122 1,80,250 1,36,803 43,447

202223 1,89,275 1,53,407 35,868

202324 2,34,531 1,68,514 66,017


ఇవి కూడా చదవండి...

ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 04:12 AM