Vijayawada: వాడివేడిగా ట్రేడర్ల భేటీ.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
ABN , First Publish Date - 2022-11-18T15:45:21+05:30 IST
ట్రేడర్లతో వాణిజ్య సలహా మండలి సమావేశం వాడివేడిగా సాగింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(Finance Minister Buggana Rajendranath) ఆధ్వర్యంలో వాణిజ్య సలహా మండలి విజయవాడ(Vijayawada)లో సమావేశం అయ్యింది.
విజయవాడ: ట్రేడర్లతో వాణిజ్య సలహా మండలి సమావేశం వాడివేడిగా సాగింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(Finance Minister Buggana Rajendranath) ఆధ్వర్యంలో వాణిజ్య సలహా మండలి విజయవాడ(Vijayawada)లో సమావేశం అయ్యింది. వాణిజ్య పన్నుల వసూళ్లు, జీఎస్టీ, విధానపరమైన నిర్ణయాలపై చర్చించారు. ఈ సందర్భంగా పన్ను వసూళ్లు, అధికారుల వేధింపులపై వాణిజ్య పన్నుల శాఖల అధికారులను, మంత్రి బుగ్గనను ట్రేడర్లు నిలదీశారు. ‘ఒకే దేశం-ఒకే పన్ను’ అంటూనే ఇంత మంది అధికారులతో తనిఖీలు.. వేధింపులు ఏంటి అని డీలర్లు ప్రశ్నించారు. పన్ను వసూళ్లలో పారదర్శకత లేదని డీలర్లు, ట్రేడర్లు ఆక్షేపించారు. ప్రభుత్వం వ్యాపారస్తులను చూసే దృష్టి కోణం మారాలని ట్రేడర్‌లు హితవుపలికారు. అలాగే అధికారులకు కూడా సరైన అవగాహన కూడా ఉండటం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే దాన్ని సమకూర్చేది ట్రేడర్లనే ఆలోచన మానుకోవాలని అధికారులకు.. మంత్రికి సూచించారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, తదితరులు పాల్గొన్నారు.