YCPలో వర్గపోరు.. దళిత సర్పంచ్ ఇంటిపై రాళ్ల దాడి
ABN , First Publish Date - 2022-12-24T12:03:41+05:30 IST
ఆముదాలవలస నియోజకవర్గంలో వైసీపీ(YCP) వర్గపోరు తారాస్థాయికి చేరింది. పొందూరు పంచాయతీలో సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు బజారున పడింది
శ్రీకాకుళం: ఆముదాలవలస నియోజకవర్గంలో వైసీపీ(YCP) వర్గపోరు తారాస్థాయికి చేరింది. పొందూరు పంచాయతీలో సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు బజారున పడింది. గ్రామ సర్పంచ్ రేగడి లక్ష్మీ ఇంటిపై అర్ధరాత్రి సొంత పార్టీ నేతలే రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనతో సర్పంచ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దళిత సర్పంచ్ అయినందుకే ఇలా దాడి చేశారని వాపోయారు. తనకు గౌరవం ఇవ్వకపోగా తిరిగి వేధిస్తున్నారంటూ లక్ష్మీ ఆరోపించారు. స్థానిక వైసీపీ నేతలు గుడ్డ మోహన్, జరజాపు వెంకట్రావు, సత్తిబాబు, అల్లంశెట్టి వికాస్, కంఠ గోవింద్ వర్గీయులే దాడి చేశారని ఆమె ఆరోపించారు. దాడి ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు లక్ష్మీ తెలిపారు.