ACB Court: ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
ABN , First Publish Date - 2023-10-13T21:49:44+05:30 IST
ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ: ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును (Nara Chandrababu Naidu) పీటీ వారెంట్‌పై (PT Warrant ) ఏసీబీ కోర్టులో (ACB Court) హాజరు పర్చాలని న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబును పీటీ వారెంట్‌పై ఈ నెల 18న బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏసీబీ కోర్టులో హాజరు పర్చాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.