టీడీపీ మేనిఫెస్టో ప్రకటించేది ఎప్పుడో చెప్పిన అచ్చెన్నాయుడు..
ABN , First Publish Date - 2023-05-23T13:36:52+05:30 IST
రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వాహణ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, టీడీపీ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 27 న టీడీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
రాజమండ్రి : రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వాహణ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, టీడీపీ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 27 న టీడీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.15 వేల మంది ప్రతినిధులతో.. 15 తీర్మానాలు రూపొందిస్తామన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విజయదశమి నాడు ప్రకటిస్తామన్నారు. 28వ తేదీన ఉదయం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నివాళులు అర్పిస్తారన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జరిగే శతజయంతి ఉత్సవాలకు 17 లక్షల మంది హాజరవుతారని అచ్చెన్నాయుడు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఈ నెల 26 న చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుందన్నారు. మహానాడులో తీర్మానాలపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.