LokeshYuvaGalam: ఆరు రోజుల్లో 72.3 కిలో మీటర్లు పూర్తి...
ABN , First Publish Date - 2023-02-02T09:24:50+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది.
చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (TDP National General Secretary NaraLokeshYuvaGalam Padayatra) విజయవంతంగా ముందుకు సాగుతోంది. జనవరి 27న ప్రారంభమైన యాత్ర నేటికి ఏడో రోజుకు చేరుకుంది. ఆరు రోజుల్లో లోకేష్ (NaraLokesh) 72.3 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేశారు. లోకేష్ (YuvaGalam)పాదయాత్రకు ప్రజలు, మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అభిమానులు, టీడీపీ శ్రేణులతో సెల్ఫీలు దిగుతూ లోకేష్ (Selfie with Lokesh) ఉత్సాహంగా పాదయాత్ర చేస్తున్నారు.
ఇవాళ రామాపురం ఎమ్మోస్ హాస్పటల్ ఎదుట విడిది కేంద్రం నుంచి టీడీపీ నేత(NaraLokeshForPeople) పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు పలమనేరు చరణ్ దాబా వద్ద ఎంఎస్ఎంఈ వర్కర్లతో సమావేశంకానున్నారు. పలమనేరు కోర్టు కాంప్లెక్స్ వద్ద లాయర్లతో సమావేశం అవుతారు. పలమనేరు సిల్క్ మార్కెట్‌లో రైతులు, రైతు కూలీలతో లోకేష్ (LokeshPadayatra) భేటీకానున్నారు. అలాగే టవర్ క్లాక్ వద్ద బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అనంతరం టమోటా రైతులు, టెర్రకోట బొమ్మల తయారీదారులతో భేటీ అవుతారు. సాయంత్రం జగమర్లలో ఎస్టీ సామాజిక వర్గీయులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రాత్రి 8:50 గంటలకు మొగిలి దేవాలయం సమీపంలోని విడిది కేంద్రానికి చేరుకోనున్నారు. మరోవైపు లోకేష్ (YuvaGalamPadayatra)తో సెల్ఫీ దిగేందుకు ఎమ్మాస్ హాస్పిటల్ వీధి కేంద్రానికి అభిమానులు భారీగా చేరుకున్నారు.