Cyclone Effect: తుఫాన్ మిగిల్చిన విషాదంలో కృష్ణా జిల్లా రైతాంగం
ABN , First Publish Date - 2023-12-07T11:41:17+05:30 IST
Telangana: మిచౌంగ్ తుఫాన్ మిగిల్చిన విషాదంలో కృష్ణా జిల్లా రైతాంగం మునిగిపోయింది. తుఫాన్ కారణంగా వీచిన గాలులు, వర్షానికి వరి పంట నేలకొరిగిపోయింది.
విజయవాడ: మిచౌంగ్ తుఫాన్ మిగిల్చిన విషాదంలో కృష్ణా జిల్లా రైతాంగం మునిగిపోయింది. తుఫాన్ కారణంగా వీచిన గాలులు, వర్షానికి వరి పంట నేలకొరిగిపోయింది. గత మూడు రోజులుగా వర్షంలో నాని ఉండడంతో ధాన్యం మొలకలు ఎత్తుతున్న పరిస్థితి. పంట కోసి నూర్పిలు చేస్తే కనీసం ఖర్చులు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పండించిన పంటను రైతులు ట్రాక్టర్లతో దమ్ము చేస్తున్నారు. మోపిదేవి మండలం కప్తానుపాలెంలో ఆరు ఎకరాల పంటను రైతు గంటా సుబ్బారావు ఆవేదనతో దమ్ము చేయించాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ట్రాక్టర్‌తో తొక్కించేయడం బాధగా ఉంటుందన్న రైతు వాపోయాడు. డ్రైనేజీ వ్యవస్థ, ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిన కారణంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని రైతు సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు.