AP News: డీజీపీని కలవనున్న జనసేన మహిళలు.. ఎందుకంటే..!
ABN , First Publish Date - 2023-07-07T15:09:58+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ పెయిడ్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారంటూ జనసేన వీర మహిళల మండిపడుతున్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (pawan kalyan) సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ పెయిడ్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారంటూ జనసేన వీర మహిళల మండిపడుతున్నారు. అసభ్య వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేన వీర మహిళలు.. డీజీపీ కార్యాలయానికి (AP DGP) వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. పవన్‌పై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరనున్నారు.