Share News

Bhanuprakash Reddy: పురంధరేశ్వరికి విజయసాయి క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2023-10-29T12:51:40+05:30 IST

విజయవాడ: మద్యం అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నాం.. కాదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా? వెంటనే విజయసాయి లెంపలు వేసుకుని.. పురంధరేశ్వరికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Bhanuprakash Reddy: పురంధరేశ్వరికి విజయసాయి క్షమాపణ చెప్పాలి

విజయవాడ: మద్యం అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నాం.. కాదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా? వెంటనే విజయసాయి లెంపలు వేసుకుని.. పురందేశ్వరికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బుద్ది ఉన్నవారు ఎవరూ ఇలా మాట్లారని అన్నారు. వైసీపీలో అందరూ కొడాలి నానిలా కావాలనుకుంటున్నారని.. నాని ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలీదని.. విజయసాయి కూడా అదే మార్గంలో వెళుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను తిట్టడం, సీఎంను మెప్పించడమే వైసీపీ నాయకులకు తెలిసిందని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్, అవినీతి ప్రదేశ్‌గా మార్చారని, ధైర్యం ఉంటే.. మేము చెప్పిన అంశాలు అవాస్తవాలని నిరూపించాలని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. డిజిటల్ యుగం నడుస్తుంటే.. మద్యం అమ్మకాల్లో కరెన్సీ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ల్యాండ్, శాండ్, మైన్స్ ద్వారా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, ఆ అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారని అన్నారు. ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా జగన్‌కు ప్రజలు ఓట్లు వెయ్యరన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌కు రెక్కలు విరిగిపోవడం ఖాయమని, బటన్ నొక్కేది జగనే కాదని.. పోలింగ్ రోజు ప్రజలు కూడా బటన్ నొక్కి వైసీపీని సాగనంపుతారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనులతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారని, కానీ జగన్ మాత్రం స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేశారో చెప్పాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొడితే.. గొడ్డును బాధినట్లు వైసీపీ నాయకులు కొట్టారని, వారిపై యాక్షన్ తీసుకోవాలంటే పోలీసులకు కూడా భయమేనని అన్నారు. ఈ పరిణామాలకు కర్త, కర్మ, క్రియ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉండే జగన్ అని అన్నారు. పురంధరేశ్వరికి విజయసాయిరెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే అడ్డుకుని తీరుతామని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

విజయసాయి వ్యాఖ్యలు..

‘నేను లిక్కర్‌ తాగను, నాన్‌వెజ్‌ తినను.. పురందేశ్వరి గారు మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు. ఏమేం బ్రాండ్లు ఉంటాయో కూడా తెలియదు. ఆమె ఈ విషయం తెలుసుకుని మాట్లాడితే బాగుండేది’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం బాపట్లలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణం వెనుక తాను, ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కుమారుడు హితేశ్‌, గీతం యూనివర్సిటీ భరత్‌తో పాటు లిక్కర్‌ సిండికేట్‌ బ్రోకర్‌ చెప్పిన మాటలు విని తన మీద, ఎంపీ మిథున్‌రెడ్డి మీద ఆధారాల్లేకుండా మద్యం ఆరోపణలు చేయడం తగదని చెప్పారు. పురందేశ్వరి చేసిన పనులు తాను బయటపెడితే ఆమె ఎక్కడ ఏం చేసుకుంటుందో తెలియదని.. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని వ్యాఖ్యానించారు. ఆమె నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారని.. తనకంటూ ఒక నియోజకవర్గం లేని వ్యక్తి అని ఎద్దేవాచేశారు. కుటుంబ ఎజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని.. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్నారు. లోకేశ్‌కు నాయకుడి లక్షణాలు లేవని విమర్శించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-10-29T12:51:40+05:30 IST