AP NEWS: వైసీపీ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ దశల వారిగా పోరాటం
ABN , First Publish Date - 2023-08-05T15:31:33+05:30 IST
వైసీపీ ప్రభుత్వ(YCP GOVt) అక్రమ, అవినీతిని ప్రశ్నించేలా బీజేపీ(BJP) దశల వారిగా పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేత మాధవ్(Madhav) అన్నారు.
గుడివాడ(Gudivada): వైసీపీ ప్రభుత్వ(YCP GOVt) అక్రమ, అవినీతిని ప్రశ్నించేలా బీజేపీ(BJP) దశల వారిగా పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేత మాధవ్(Madhav) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల వికాసానికి కేంద్రం కృషి చేస్తోంటే.... పంచాయతీల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ..... పెద్ద ఎత్తున కేంద్ర నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమల్లిస్తుందన్నారు..కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని పంచాయతీల హక్కుల పరిరక్షణకు ఈనెల 10వ తేదీన చలో కలెక్టరేట్‌కి పిలుపునిచ్చారు. మణిపూర్ అల్లర్లు కేవలం రెండు తెగల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణలేనని మతాల మధ్య కాదని మాధవ్ చెప్పారు.