Chalo Rajahmundry: కొల్లు రవీంద్రకు నోటీసులు ఇచ్చేందుకు ఖాకీల యత్నం..కానీ

ABN , First Publish Date - 2023-10-05T09:12:19+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఛలో రాజమండ్రికి బాలకృష్ణ అభిమానులు పిలుపునిచ్చారు. అయితే ఛలో రాజమండ్రికి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు.

Chalo Rajahmundry: కొల్లు రవీంద్రకు నోటీసులు ఇచ్చేందుకు ఖాకీల యత్నం..కానీ

కృష్ణా జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను (TDP Chief Chandrababu Arrest)నిరసిస్తూ ఛలో రాజమండ్రికి బాలకృష్ణ అభిమానులు పిలుపునిచ్చారు. అయితే ఛలో రాజమండ్రికి (Chalo Rajahmundry) అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోజిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Former Minister Kollu Ravindra) ఇంటికి వచ్చిన ఖాకీలు.. ఆయనకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను తీసుకునేందుకు రవీంద్ర నిరాకరించారు. ఏ రూల్ ప్రకారం తనకు నోటీసులు ఇస్తున్నారని టీడీపీ నేత ప్రశ్నించారు. సెక్షన్ 19A సెక్షన్ ప్రకారం తన ప్రజాస్వామ్య హక్కుని అడ్డుకోవడానికి తమరెవరని పోలీసులను నిలదీశారు. నోటీసులు తీసుకునేందుకు కొల్లు రవీంద్ర నిరాకరించడంతో పోలీసులు వెనుతిరిగారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-10-05T09:12:19+05:30 IST