TDP Leader: ‘బాధితులే నిందితులు... ఇదే జగన్ చట్టం’

ABN , First Publish Date - 2023-02-22T13:17:59+05:30 IST

గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్‌కు కోర్టు రిమాండ్ విధించింది.

TDP Leader: ‘బాధితులే నిందితులు... ఇదే జగన్ చట్టం’

కృష్ణా: గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్‌ (TDP Leader Pattabhi Ram)కు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు గన్నవరం సబ్‌జైలు (Gannavaram Subjail)కు తరలించారు. విషయం తెలిసిన టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు (TDP Leader pilli Manikyala rao) గన్నవరం సబ్‌జైలుకు చేరుకున్నారు. పట్టాభిని సబ్ జైలుకు తరలించే సమయంలో మాణిక్యాలరావు పట్టాభిని కలిసి పరామర్శించారు. అనంతరం మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడుతూ.. బాధితులే నిందితులు అని... ఇదే జగన్ (AP CM Jagan Reddy) చట్టం అని వ్యాఖ్యలు చేశారు. ఏపీ (Andhrapradesh) లో పోలీసులు ఈ కొత్త చట్టాన్నే అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టాభి (TDP Leader)ని తీసుకెళ్లింది ఎవరు... పోలీసులకు అప్పగించింది ఎవరు అని ప్రశ్నించారు. ఆయన పై థర్డ్ డిగ్రీ (Third Degress) ప్రయోగించి నడవలేకుండా చేశారన్నారు. కొంతమంది పోలీసు అధికారులు తీరు పోలీసు వ్యవస్థకే మాయని మచ్చగా ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతల దాడులే కనిపిస్తున్నాయన్నారు. పోలీసులకు ఇవేమీ కనిపించడం లేదా అని నిలదీశారు. న్యాయం కోసం పోలీస్టేషన్‌కు వెళ్లి అన్యాయమైపోతున్నారని అన్నారు. చివరకు అత్యాచార బాధితులను వదలకుండా కేసులు పెడుతున్నారని తెలిపారు. అధికార పార్టీకి కొమ్ము కాసే పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామని... న్యాయస్థానంలో పోరాడతామని అన్నారు. న్యాయం జరిగేలోపు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని జగన్ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ఇటువంటి పోలీసులే కోర్టు ముందు దోషులుగా నిలబడటం ఖాయమన్నారు. జగన్‌ను నమ్మి మీ జీవితాలను బలి చేసుకోవద్దు అంటూ పోలీసులకు పిల్లి మాణిక్యాలరావు హితవుపలికారు.

Updated Date - 2023-02-22T13:18:00+05:30 IST