Chandrababu: నందికొట్కూరు సభలో సీఎం జగన్‌, బైరెడ్డిపై చంద్రబాబు ఫైర్

ABN , First Publish Date - 2023-08-01T15:48:09+05:30 IST

నందికొట్కూరు ఎమ్మెల్యేను కూడా లెక్క చేయని ఓ వైసీపీ నాయకుడు విర్ర వీగుతున్నాడు. రౌడీయిజం చేస్తే ఖబడ్దార్. మాటలు మాట్లాడటం కాదు. అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేయాలి. రౌడీయిజం చేస్తే తాట తీస్తా. సైకో జగన్ ఊరికో రౌడీని తయారు చేశాడు.

Chandrababu: నందికొట్కూరు సభలో సీఎం జగన్‌, బైరెడ్డిపై చంద్రబాబు ఫైర్

నంద్యాల: ఒక్క ఛాన్స్ అంటూ పీఠమెక్కిన సీఎం జగన్.. జనాన్ని పిడిగుద్దులు గుద్ది రాయలసీమకు అన్యాయం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నందికొట్కూరులోని పటేల్ సెంటర్‌లోకి పెద్ద ఎత్తున తరలివచ్చిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘అలగనూరు రిజర్వాయర్‌లో చుక్క నీరు లేదు. సీఎం జగన్ (CM JAGAN) ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా చేశారు. కర్నూలు-గుంటూరు వెళ్లే జాతీయ రహదారికి గుంతలు పడితే మట్టి వేయలేని జగన్ మూడు రాజధానులు కడతారంట. జగన్‌కు ఇదే చివరి అవకాశం. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును నేను నిర్మిస్తే జగన్ రిబ్బన్ కట్ చేసి నేను కట్టించానని చెప్పుకుంటున్నారు. జగన్ పిరికిపంద.. పరదాల చాటున వెళ్లడం కాదు. ధైర్యం ఉంటే నందికొట్కూరు పటేల్ సెంటర్‌కు జగన్ రావాలి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నేను ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌కు శ్రీకారం చుట్టాను. సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేశాను. కానీ జగన్ ధ్వంసం చేశాడు.’’ అంటూ మండిపడ్డారు.

‘‘ధ్వంసమైన సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధం ప్రకటించడానికి వచ్చాను . రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి ఘోరంగా ఉంది. దీనిపై జగన్ చర్చకు సిద్దమా?. చేసిన అన్యాయం ఒప్పుకొని జగన్ నేలకు ముక్కు రాయాలి. చేతకాని జగన్ రాజీనామా చేయాలి. రాయలసీమ ఎలా సస్యశ్యామలం కాదో చేసి చూపిస్తాను. నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని నేనే పూర్తి చేసి నీళ్లు ఇచ్చాను. బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ గేట్ వే ఆఫ్ రాయలసీమ, నందమూరి తారక రామారావు రాయలసీమకు సాగు నీళ్లివ్వడంతో పాటు చెన్నై నగరానికి తాగునీరు కూడా ఇచ్చాను. కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయం ఉన్నా రాయలసీమకు నీళ్లు అందని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కార్యక్రమాలు చేశాను.’’ అని చంద్రబాబు గుర్తుచేశారు.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చంద్రబాబు పరోక్ష వార్నింగ్..

‘‘నందికొట్కూరు ఎమ్మెల్యేను కూడా లెక్క చేయని ఓ వైసీపీ నాయకుడు విర్ర వీగుతున్నాడు. రౌడీయిజం చేస్తే ఖబడ్దార్. మాటలు మాట్లాడటం కాదు. అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేయాలి. రౌడీయిజం చేస్తే తాట తీస్తా. సైకో జగన్ ఊరికో రౌడీని తయారు చేశాడు. ఇలాంటి వారిని మురికి కాలువల్లో వేసి తొక్కితే దరిద్రం పోతుంది.’’ అంటూ చంద్రబాబు ఫైరయ్యారు.

ఇది కూడా చదవండి: TSRTC : ఆర్టీసీ విలీనంపై 5 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ పలుకులివీ.. వీడియో వైరల్..

Updated Date - 2023-08-01T16:06:52+05:30 IST