Share News

Anagani Satya Prasad: మున్సిపల్ కార్మికుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి.. టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:21 PM

కరోనాలో ప్రాణాలకు తెగించి పని చేసిన కార్మికుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కార్మికులకు కనీసం రక్షణ పరికరాలు కూడా ఇవ్వకుండా వేధించారని అన్నారు.

Anagani Satya Prasad: మున్సిపల్ కార్మికుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి.. టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

అమరావతి: కరోనాలో ప్రాణాలకు తెగించి పని చేసిన కార్మికుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కార్మికులకు కనీసం రక్షణ పరికరాలు కూడా ఇవ్వకుండా వేధించారని అన్నారు. స్కానింగ్ మెషీన్లు ఇచ్చి అదనపు పని భారాన్ని మోపారని ఆయన ఆరోపించారు. పట్టణాల్లో తగినంత సిబ్బందిని నియమించకుండా పని ఒత్తిడి పెంచి వేధిస్తున్నారని సత్యప్రసాద్ విమర్శించారు. కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్ రెడ్డి కుళ్లిన సర్కారును పారిశుధ్య కార్మికులే రానున్న ఎన్నికల్లో ఊడ్చి చెత్తకుప్పలో పడేస్తారని ఆయన అన్నారు. విషపూరిత మలినాల మధ్య ఉండే కార్మికులకు కనీసం హెల్త్ అలవెన్సులు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.


తాడేపల్లి ప్యాలెస్ ఖజానాకు లక్షల కోట్లు జమ చేసుకుంటన్న జగన్ రెడ్డి కష్టపడే కార్మికులకు వేతనాలు పెంచలేడా? అని ప్రశ్నించారు. జగన్ సర్కార్ ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి కార్మికుల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని సత్యప్రసాద్ కోరారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో సమ్మె విరమించాలని మునిసిపల్ కార్మికులకు అధికారులు బెదిరింపులకు దిగారు. ‘విధులకు హాజరు కండి. మీకు పోలీసులతో రక్షణ కల్పిస్తాం. లేకపోతే విధుల నుండి తొలగిస్తామని’ మునిసిపల్ శానిటేషన్ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో సీఐటీయూ నాయకులతో కలసి అధికారులను మునిసిపల్ కార్మికులు అడ్డుకున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:21 PM