Anitha : మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరంతా డ్రామా.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులే
ABN , First Publish Date - 2023-10-04T12:12:26+05:30 IST
మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరంతా డ్రామా అని.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులేనని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితా పేర్కొన్నారు. రోజా తన పూర్వ వీడియోలు ఒకసారి చూడాలని.. అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో తెలుస్తుందన్నారు.
విశాఖ : మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరంతా డ్రామా అని.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులేనని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితా పేర్కొన్నారు. రోజా తన పూర్వ వీడియోలు ఒకసారి చూడాలని.. అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో తెలుస్తుందన్నారు. ఆడదానివన్న సంగతి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని రోజాను ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో ఆడ పిల్లలు మాన ప్రాణాలు పోతున్నా ఎవరూ స్పందించలేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు రోజా మద్యం బాటిల్స్ బద్దలు కొట్టింది. ఇపుడు ఏరులై పారుతున్నా ఎందుకు స్పందించడం లేదు? సామాజిక మాధ్యమాల్లో ఉన్న విషయాన్ని బండారు సత్యనారాయణ మాట్లాడారు.
నా గురించి రోజా చాలా నీచంగా మాట్లాడారు. అంత కన్నా నీచంగా బండారు మాట్లాడారా? నేను ఎన్నో కేసులు పెట్టినా అయినా పోలీసులు స్పందించలేదు. ఇపుడు చీటికీ మాటికి మాపై కేసులు పెడుతున్నారు. బ్రాహ్మణి గారికి జడలుకు వేశానని చెప్పావు.. ఇప్పుడు విమర్శలా? భువనేశ్వరి కాళ్ళు పట్టుకోలేదా? భువనేశ్వరిపై విమర్శలు చేస్తున్నపుడు.. నువ్వు నవ్విన నవ్వు మేము ఎప్పుడూ మర్చిపోము. బాబు జైలుకు వెళ్ళినప్పుడు స్వీట్లు పంచుకుంటావా? రోజా.. నీకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయే. బాబుని కామ సిఎం అని రోజా మాట్లాడలేదా? భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ మీద అవాకులు చెవాకులు పేలలేదా? రోజా, భారతీ రెడ్డి గురించి మాట్లాడితే... మా ఇంటికి పోలీసులు వస్తారు. వాళ్ళు మాట్లాడితే నో పోలీస్. యూట్యూబ్లో ఉన్న వాటిని తీయంచుకోవాలని రోజాకి సలహా ఇస్తున్నాం’’ అని అనిత పేర్కొన్నారు.